here the preparation plan for Pesarapappu Poornalu By , 2016-11-03 here the preparation plan for Pesarapappu Poornalu Pesarapappu poornalu is the one of the delicious telugu food item. Here the Process of Pesarapappu poornalu. Prep Time: 30min Cook time: 30min Ingredients: పెసరపప్పు : 2 కప్పులు,,బెల్లం : 2 కప్పులు.,కొబ్బరి : అర చెక్క (తురుము),,యాలుకులు : 4,,బియ్యం : 2 కప్పులు,మినప్పప్పు : ఒక కప్పు,,ఉప్పు : రుచికి,,నూనె : వేయించడానికి సరిపడా, Instructions: పూర్ణాలు తయారు చేసుకోవడానికి ముందురోజు రాత్రి బియ్యం, మినప్పప్పు నాన పెట్టుకోవాలి. మరునాడు పూర్ణాలు తయారు చేసుకోవడానికి ఒక అరగంట ముందు బియ్యం, మినప్పప్పు దోసెల పిండిలాగా రుబ్బుకోవాలి. అలాగే పెసరపప్పును కూడా గంటసేపు నానబెట్టు కోవాలి. తర్వాత పప్పును ఇడ్లీ పిండిలా రుబ్బుకోవాలి. రుబ్బిన మిశ్రమాన్ని ఇడ్లీ లాగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లం పాకాన్ని ముదురు పాకంలాగా చిక్కగా తీసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీలుగా వేసుకున్న ఆ కుడుములను మనం పొడి చేసుకుని అందులో యాలుకుల పొడి, కొబ్బరి, బెల్లం పాకాన్ని వేసి కలుపుకోవాలి. దానిని ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. తరువాత మినప్పప్పు, బియ్యం పిండిలో కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. బాండిలో నూనె కాగిన తరువాత ఆ ఉండలను అ రుబ్బులో ముంచి నూనెలో వేయించుకుంటే పెసరపప్పు పూర్ణాలు తయారైనట్లే. కొంచెం వేడిగా ఉండగానే అందులో నెయ్యి వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి.
Yummy Food Recipes
Add