mutton paya By , 2014-07-04 mutton paya mutton paya, paya with mutton, making of mutton paya, teasty mutton paya, hot hot mutton paya, mutton paya in telugu Prep Time: 15min Cook time: 50min Ingredients: 4 కాల్చిన మేక కాళ్లు, 2 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్లు కారం, 3 టేబుల్ స్పూన్లు ధనియాలపొడి, పావు కేజి టమాటాలు, కొద్దిగా చింతపండు, 4 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్నపిండి), పావు టేబుల్ స్పూన్ గరంమసాల, 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా, 8 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా మేక కాళ్లను శుబ్రంగా కడగాలి. Step 2 ప్రేషర్ కుక్కర్లో మేక కాళ్లు వేసి 7 గ్లాసుల నీరు పోయాలి. ఇందులో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి, ధనియాలపొడి, పసుపు, ఉప్పు వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి తరువాత సిమ్ లో అరగంట సేపు ఉడికించాలి. Step 3 ఇప్పుడు పాన్ లో నూనె వేసి నూనె వేడి అయిన తరువాత ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, వేసి కాసేపు వేగనివ్వాలి. అల్లంవెల్లుల్లి, కారం, ధనియాలపొడి, మొక్కజొన్నపిండి వేసి బాగా కలపాలి. Step 4 తరువాత టమాటాలు, చింతపండు పోసి 2 నిమిషాల పాటు ఉడికించాలి. ఇందులో ముందుగా ఉడికించుకున్న మేక కాళ్లను రసంతో సహా వేసి, కొత్తిమీర, పుదీనా వేసి 2 నిమిషాలపాటు మరిగించి దించాలి. అంతే టేస్టీ మటన్ పాయ రెడీ, ఇది వేడి వేడిగా తింటే బాగుటుంది.
Yummy Food Recipes
Add