Mutton Keema mutter By , 2018-04-29 Mutton Keema mutter Here is the process for Mutton Keema mutter making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 40min Ingredients: మటన్‌ ఖీమా-కేజి,పచ్చి బఠాణీలు-ఒక కప్పు,నిమ్మరసం-ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌,వంటనూనె-రెండు టేబుల్‌స్పూన్లు,ఉల్లిపాయలు(ముక్కలుగా తరిగినవి)-రెండు,వెల్లుల్లి రెబ్బలు(చిన్న ముక్కలుగా తరిగినవి)-ఎనిమిది,అల్లం ముక్కలు-ఒక టేబుల్‌స్పూన్‌,ఉప్పు-రుచికి సరిపడా,కారం-ఒక టీస్పూన్‌,ధనియాల పొడి-ఒక టీస్పూన్‌,జీలకర్ర పొడి-ఒక టీస్పూన్‌,గరం మసాల పొడి-ఒక టీస్పూన్‌,పచ్చిమిర్చి(ముక్కలుగా తరగాలి)-రెండు., Instructions: Step 1 అడుగు మందంగా ఉండే ఓ పాత్రను స్టవ్‌పై ఉంచి, అందులో నూనె పోసి, అది వేడెక్కాక అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఉప్పు వేసి లేత గోధుమ రంగు వచ్చేంత వరకు వేగించాలి. Step 2 పచ్చిమిర్చి ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాల పొడి అన్నీ వేసి కలపాలి.  Step 3 ఇప్పుడు మటన్‌ ఖీమా వేసి ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి.  Step 4 తరువాత ముప్పావు కప్పు వేడి నీరు పోసి మంట పెద్దది చేయాలి. ఉడికే స్థాయికి రాగానే పైన మూత పెట్టి మంట తగ్గించి 30 నిమిషాలపాటు ఉడికించాలి.     Step 5 తరువాత నానబెట్టిన పచ్చి బఠాణీలు వేసి, నిమ్మరసం పిండాలి. కాస్త దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించి దించేయాలి.                  
Yummy Food Recipes
Add