gangavalli mango pappu|mango pappu recipe| veg recipe By , 2016-05-25 gangavalli mango pappu|mango pappu recipe| veg recipe how to prepare in gangavalli mango pappu, special mango recipe, more details www.telugufoodrecipes.com Prep Time: 15min Cook time: 30min Ingredients: ఒక కప్పు  కందిపప్పు,ఒక కట్ట గంగవాయిలు ఆకుకూర,రెండు  పచ్చి మామిడికాయలు,నాలుగు పచ్చిమిరపకాయలు,ఒక్కటి టమటా,రెండు టీస్పూన్లు    నెయ్యి,తగినంత‌ ఉప్పు,పోపుకు సరిపడా‌   జీలకర్ర, ఆవాలు, మెంతులు,అర టీస్పూను‌   పసుపు,ఐదు‌         వెల్లుల్లి గడ్డలు, Instructions: Step 1 ముందుగా గంగవాయిలు ఆకుకూరను శుభ్రం చేసుకుని, నీటిలో బాగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే మామిడికాయలను కూడా కడిగి, ఆపై తురిమి పక్కన ఉంచుకోవాలి. Step 2 కందిపప్పును కూడా శుబ్రంగా కడిగి ఒక పాత్రలోకి తీసుకొని ఉండికించుకోవాలి. ఇందులోనే టమటా, పచ్చిమిర్చిని కూడా నిలువున కట్ చేసి, విటితో పాటె పసుపు వేసి ఉడికించుకొవాలి. Step 3 ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో నెయ్యివేసి స్టవ్‌పై పెట్టి,  నెయ్యి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిలతో తాలింపు పెట్టాలి. అందులోనే మామిడికాయ తరుమును, తరిగి ఉంచుకున్న గంగవాయిలు కూరను వేసి ముందుగా ఉండికించుకున్నకంది పప్పును వేసి తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి కాసెపు ఉడికించి క్రిందకు దింపాలి. అంతే గంగవల్లి మామిడికాయ పప్పు రెడీ. Step 4 ఈ పప్పును వేడివేడి అన్నంలో తీంటూంటే చాలా రుచికరముగా ఉంటుంది.
Yummy Food Recipes
Add