egg biryani By , 2016-05-12 egg biryani egg biryani cooking tips: The cooking tips to make egg biryani recipe which filled with number of healthy ingradients. Prep Time: 15min Cook time: 15min Ingredients: ఆరు కోడిగ్రుడ్లు, అరకప్పు కొత్తిమీర, పుదీనా తురుము,ఆరు పచ్చిమిర్చి, మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్, మూడు టేబుల్ స్పూన్లు అల్లం, వెల్లుల్లి పేస్ట్, అర టేబుల్ స్పూన్. కుంకుమపువ్వు, సరిపడా  కారం, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్. నిమ్మరసం, నాలుగు కప్పులు  బాస్మతి బియ్యం, మూడు బిర్యానీ ఆకులు, ఐదు లవంగాలు, రెండు టమాటాలు, కప్పు ఉల్లి ముక్కలు, Instructions: Step 1 ముందుగా కోడిగ్రుడ్లను ఉడికించి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. Step 2 అలాగే కుంకుమ పువ్వును గోరువెచ్చని పాలలో నానబెట్టుకోవాలి. Step 3 లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, మిరియాలను పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. Step 4 బాస్మతి బియ్యంలో సరిపడా నీటిని పోసి, అందులో యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకులు, పుదినా ఉప్పు వేసి వండుకోవాలి. Step 5 తర్వాత ఉడికించిన అన్నాన్ని వెడల్పాటి ప్లేటులోకి తీసుకుని చల్లార్చాలి. Step 6 ఒక పాత్రలో నెయ్యి వేసి వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి. Step 7 ఉల్లిపాయలు వేగాక, పచ్చిమిర్చి అల్లం, వెల్లుల్లి ముద్ద ఒకదాని తరువాత ఒకటి వేసి 2 నిమిషాలు వేపాలి. తర్వాత కారం, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, ఉప్పు వేసి కలియబెట్టాలి. Step 8 ఈ మిశ్రమంలో టమాటా, కోడిగ్రుడ్లు వేసి మసాలా కలిసేలా వేపుకోవాలి. ఇందులో పెరుగు, నిమ్మరసం వేసి పది నిమిషాలు కలిపి స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టాలి Step 9 మరో పాత్ర తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి ఉడికించుకున్న అన్నాన్ని వేయాలి. Step 8 దీని మీద కోడిగుడ్డు మసాలా కలిపి వేయించిన మిశ్రమం వేసి అంతా సర్దాలి. దీనిపై నెయ్యి, పాలలో నానబెట్టిన కుంకుమపువ్వు చిలకరించి, కొత్తిమీర చల్లి మూత పెట్టి పదినిమిషాల పాటు ఉడికించి దింపేయాలి.
Yummy Food Recipes
Add