emon chicken recipe making tips weekend special food item By , 2014-12-20 emon chicken recipe making tips weekend special food item emon chicken recipe making tips weekend special food item : the simple tips to make lemon chicken recipe for special weekend. Prep Time: 40min Cook time: 35min Ingredients: 1/2 కేజీ చికెన్, 3 టీ స్పూన్లు నిమ్మరసం, 6 టీ స్పూన్లు కార్న్ ఫ్లోర్, 3-4 క్యాప్సికమ్, 1 కప్పు చికెన్ స్టార్స్, 6 టీ స్పూన్లు మిరియాలపొడి, వంటకానికి సరిపోయేంత నూనె, రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 చికెన్’ను చిన్న ముక్కలుగా కోసుకుని నీటిలో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ ముక్కలకు ఒక స్పూన్ నిమ్మరసం, ఉప్పు కలిపిన నీటిని పట్టించాలి. Step 2 మరొక పాత్రను తీసుకుని అందులో రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్’ను తీసుకోవాలి. అందులో అరకప్పు నీటిని వేసి.. బాగా కలియబెట్టాలి. Step 3 మరోవైపు క్యాప్సికమ్స్’ను తీసుకుని వాటిని తగినంత సైజులో ముక్కలుగా తరగాలి. అనంతరం అందులోని విత్తనాలను పూర్తిగా తొలగించుకోవాలి. Step 4 ఇప్పుడు స్టౌవ్ మీద ఒక బాణలి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో ఇదివరకు పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను కార్న్ స్టార్సిల్’లో మెదిపి.. దోరగా వేయించుకోవాలి. అనంతరం వాటిని కిందకు దించేసి పక్కన పెట్టుకోవాలి. Step 5 మరో బాణలి తీసుకుని అందులో రెండు స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో క్యాప్సికమ్ ముక్కల్ని వేసి వేపుకోవాలి. అనంతరం ఇందులో మిరప్పొడి, తగినంత ఉప్పు, చికెన్ స్టాక్ కలిపి కాసేపు తెల్లనివ్వాలి. Step 6 బాగా మరిగాక అందులో ఇదివరకు కలిపి పెట్టుకున్న కార్న్’ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి మరికొద్దిసేపటి వరకు వేయించాలి. అనంతరం చికెన్ ముక్కలను వేసి మరో పదినిముషాలపాటు ఉడికించాలి. చికెన్ ముక్కలు ఉడుకుతుండగానే మిగిలిన నిమ్మరసాన్ని చేర్చాలి. Step 7 ఈ మొత్తం మిశ్రమాన్ని 10 నిముషాలపాటు మీడియం మంట మీద వేడి చేసుకున్న అనంతరం క్రిందకు దించేయాలి. అంతే! చికెన్ లెమన్ రిసిపీ రెడీ!
Yummy Food Recipes
Add