coconut rice recipe cooking tips By , 2015-01-05 coconut rice recipe cooking tips coconut rice recipe cooking tips : the cooking tips to make coconut rice recipe. Prep Time: 30min Cook time: 30min Ingredients: అర కేజీ పులావు బియ్యం, ఒకటి కొబ్బరికాయ, తగినంత ఉప్పు, 4-5 ఎండుమిర్చి, 4-5 పచ్చిమిర్చి, 2 టీ స్పూన్స్ శెనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 2 రెమ్మలు కరివేపాకు, అర కప్పు నెయ్యి లేదా నూనె, 20 గ్రాములు జీడిపప్పు, 10 గ్రాములు కిస్’మిస్, Instructions: Step 1 ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత అన్నాన్ని పొడిపొడిగా వండుకోవాలి. మరోవైపు కొబ్బరి తురిమి పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు ఓ వెడల్పాటి పళ్లెంలో అన్నం వేసి, సగం నూనె పోసి కలుపుకోవాలి. Step 3 ఇప్పుడు స్టౌవ్ మీద ఓ కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి వేయించాలి. అనంతరం పోపు సామాను వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించాలి. Step 4 ఈ మొత్తం పోపును అన్నంలో వేసి కలపాలి. అనంతరం నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్’మిస్’లను కూడా అన్నంలో కలుపుకోవాలి. Step 5 ఇక చివరగా రుచికి తగినంత ఉప్పు, కొబ్బరి తురుము కూడా వేసి బాగా కలుపుకుని.. ఓ గంటసేపు అలాగే వుంచుకోవాలి. అంతే! కోకోనట్ రైస్ రెడీ!
Yummy Food Recipes
Add
Recipe of the Day