karaikkudi mutton chops recipe cooking tips By , 2015-01-05 karaikkudi mutton chops recipe cooking tips karaikkudi mutton chops recipe cooking tips : the cooking tips to make karaikkudi mutton chops recipe. It is a tamil dish. Prep Time: 30min Cook time: 35min Ingredients: ఒకటిన్నర కేజీ మటన్ ముక్కలు, 100 గ్రాములు ఉల్లిపాయలు, 100 గ్రాములు టమోటాలు, 25 గ్రాములు అల్లంవెల్లుల్లి ముద్ద, 6 టీ స్పూన్స్ కారం, 5 టీ స్పూన్స్ ధనియాలపొడి, 2 టీ స్పూన్స్ పసుపు, తగినంత నూనె, 1 టీ స్పూన్ గరంమసాలా, నాలుగు కోడిగుడ్లు, ఒక కట్ట కొత్తిమీర, Instructions: Step 1 ముందుగా ఉల్లిపాయలు, టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే అల్లంవెల్లుల్లి నూరుకోవాలి. మరోవైపు కోడిగుడ్లన్నీ పగులకొట్టి సొనన్న ఓ పాత్రలోకి వంపాలి. అందులో పసుపు, తరిగిన కొత్తిమీర వేసి సొనను బాగా గిలక్కొట్టుకోవాలి. Step 2 ఇప్పుడు ఓ బాణలి తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసి వేయించాలి. నూనె కాగిన తర్వాత అందులో ఉల్లిపాయల ముక్కలు వేసి.. అవి బ్రౌన్ కలర్’లోకి వచ్చేంతవరకు వేయించాలి. తర్వాత అల్లంవెల్లుల్లి ముద్ద కూడా వేసి మరికొద్దిసేపటివరకు ఉడికించుకోవాలి. Step 3 కాసేపు వాటిని వేగించిన తరువాత కారం, పసుపు, ధనియాలపొడి, టమోటా ముక్కలు కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. అనంతరం ఈ మిశ్రమంలో మటన్ ముక్కలు వేసి కొద్దిసేపటివరకు ఉడికించుకోవాలి. కాసేపటితర్వాత కొద్దిగా నీళ్లు చిలకరించి.. అవి ఆవిరైపోయే వరకూ ఉడికించుకోవాలి. Step 4 ఇప్పుడు మరో బాణలి తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసి వేయించాలి. నూనె కాగిన తర్వాత ఆ మటన్ ముక్కలను ఇదివరకు గిలక్కొట్టిన సొనలో ముంచి.. పకోడీల మాదిరిగా వేయించి తీసేయాలి. అంతే! కారైక్కుడి మటన్ చాప్స్ రెడీ!
Yummy Food Recipes
Add
Recipe of the Day