Coconut milk Semiya Payasam making evening snacks By , 2014-12-10 Coconut milk Semiya Payasam making evening snacks Coconut milk Semiya Payasam : this recipe is simple to make in less time. It contains some healthy ingredients which helps to increase immunity level in human body. Prep Time: 30min Cook time: 20min Ingredients: 1 కప్ సేమియా, 1/2 లీటర్స్ పాలు, 1/2 కప్ కొబ్బరిపాలు (పచ్చికొబ్బరి తురిమి గ్రైండ్ చేసి వడగట్టిన పాలు), 11/2 పంచదార, 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పొడి, 1/2 టేబుల్ స్పూన్స్ యాలకుల పొడి, 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు, మినప్పప్పు, పెసరపప్పు (అన్నీకలిపి), 1/4 కప్ ద్రాక్ష, బాదం, జీడిపప్పు (అన్నీ కలిపి), Instructions: Step 1 ఒక పాన్ తీసుకుని అందులో నువ్వులు, మినప్పప్పు, పెసరపప్పు తదితర పదార్థాలు విడివిడిగా వేడి చేసుకోవాలి. అలా వేడి చేసిన అనంతరం మూడింటిని కలిపి మెత్తగా పొడిలా చేసుకోని పెట్టుకోవాలి. Step 2 అదే పాన్’లో కొద్ది నెయ్యి వేసి వేడి చేసిన అనంతరం జీడిపప్పు, ద్రాక్ష, బాదం వేసి వేడి చేసుకోవాలి. వేడయిన అనంతరం ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. Step 3 మరోసారి అదే పాన్’లోనే కొద్దిగా నెయ్యి వేసి.. సేమ్యాను వేయించి పెట్టుకోవాలి. Step 4 మరోవైపు మరో పాన్ తీసుకుని అందులో పాలు పోసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో కొబ్బరిపాలను చేర్చి.. మరోసారి వేగించాలి. బాగా వేడైన తర్వాత సన్నని మంటపై వుంచి, అందులో సేమ్యా వేయాలి. అనంతరం పంచదార వేయాలి. Step 5 అది వేడవుతున్నప్పుడు అందులో అరకప్పు పాలలో ఇదివరకే సిద్ధంచేసుకున్న మూడు మిశ్రమాల పొడిని కలిపి.. మరుగుతున్న పాలలో వేసి వేయించాలి. 10 నిముషాల తర్వాత జీడిపప్పు, యాలకులపొడి వేసి కలుపుకోవాలి. Step 6 చివరగా జీడిపప్పు, ద్రాక్ష, బాదంతో గార్నిష్ చేయాలి. అంతే కొబ్బరిపాల సేమ్మా పాయసం రెడీ!
Yummy Food Recipes
Add