tomato fish curry recipe cooking tips By , 2015-01-02 tomato fish curry recipe cooking tips tomato fish curry recipe cooking tips : the cooking tips to make tomato fish curry recipe. It tastes different than other fish recipes. Prep Time: 30min Cook time: 40min Ingredients: 8-10 పీసెస్ చేపముక్కలు, 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పేస్ట్, 6-8 టమోటాలు (మీడియం సైజ్’లో కట్ చేయాలి), 8-10 బంగాళదుంపలు (స్లైసెస్’గా కట్ చేయాలి), 1-3 ఉల్లిపాయలు ( సన్నగా తరగాలి), 6-8 వెల్లుల్లి రెబ్బలు (సన్నగా తరగాలి), కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర తరుగు, 2 టీ స్పూన్స్ చింతపండు గుజ్జు, 2 టీ స్పూన్స్ కొబ్బరి నూనె, Instructions: Step 1 చేపముక్కలను శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వాటిని పసుపు, ఉప్పుతో మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకూ ఫ్రై చేయాలి. Step 3 తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు వేసి ఓ నిముషంపాటు వేయించాలి. అనంతరం టమోటా పేస్ట్ వేసి మొత్తం మిశ్రమాన్ని కలియబెడుతూ 10 నిముషాలవరకు ఉడికించుకోవాలి. Step 4 అలా ఉడికించిన తర్వాత రెడ్ చిల్లీ పేస్ట్ వేసి మరో 5 నిముషాలవరకు వేయించాలి. తర్వాత బంగాళదుంపలు చేర్చి వేడి చేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని చిక్కగా గ్రేవీ అయ్యేంతవరకు వేయించుకోవాలి. Step 5 గ్రేవీ ఏర్పడిన తర్వాత అందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను వేసి, ఆ పాత్రకు మూతపెట్టి 10 నిముషాలవరకు మీడియం మంటమీద వేయించాలి. Step 6 చివరగా మూతతీసి చింతపండు గుజ్జును అందులో వేసి 1 నిముషంపాటు వేయించాలి. ఇక స్టౌవ్ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే! టమోటా ఫిష్ కర్రీ రెడీ!
Yummy Food Recipes
Add