Grapes Halwa By , 2018-07-11 Grapes Halwa Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Grapes Halwa making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: నల్లద్రాక్షలు : వంద గ్రాములు,మైదా : పావుకేజీ,పంచదార : పావుకేజీ,జీడిపప్పుల ముక్కలు : 1 టేబుల్ స్పూన్,బాదం పప్పుల ముక్కలు : 1 టేబుల్ స్పూన్, Instructions: Step 1 ఈ హల్వా తయారీకి మంచి మైదా పిండిని తీసుకోవాలి. మైదాలో నీటిని కలిపి ముద్దలా కలపాలి. ఇలా కలుపుకున్న ముద్దలో మూడు కప్పుల నీళ్లు పోసి పూర్తిగా కరిగేలా చేసుకోవాలి.  Step 2 అరగంటకి కలిపిన మైదాలో నీళ్ళు  పైకి తేరుకుంటాయి.తేరుకున్న నీరు తీసేస్తే, అడుగున మైదా పాలు వుంటాయి. ఇవి యించుమించు రెండు కప్పులు పాలు వుంటాయి. Step 3 మార్కెట్ నుండి మంచి ద్రాక్ష పళ్లు తీసుకురావాలి. వీటిని మిక్సీలో వేసి జ్యూస్ లా చేసి ఉంచుకోవాలి.  Step 4 బాణిలి తీసుకుని దానిలో చక్కెర పాకం తయారుచేసుకోవాలి.  Step 5 తీగ పాకం వచ్చాక మైదా పాలు, ద్రాక్ష జ్యూసు వేసి కలపాలి. మాడిపోకుండా కలుపుతుండాలి. Step 6 ఇది గట్టిపడి ముద్దలా అవ్వుతుంది. ఇప్పుడు నెయ్యి వేసి కలపాలి. మైదాపాలు, ద్రాక్ష రసం, పంచదార, నెయ్యి బాగా కలిసి ముద్దలాఅయి బాండి అంచులు విడుతుంది. అంటే హల్వా తయార్ అయ్యినట్టే. 
Yummy Food Recipes
Add