Goduma ravva upma By , 2018-07-07 Goduma ravva upma Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Goduma ravva upma making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: గోధుమలు 1 కప్పు,ఉల్లిపాయ 1 చిన్నది,పచ్చిమిర్చి 2,కరివేపాకు 2 రెబ్బలు,పసుపు 1/4 టీస్పూన్,కారంపొడి 1/2 టీస్పూన్,అల్లంవెల్లుల్లి ముద్ద 1/2 టీస్పూన్,గరం మసాలా పొడి 1/4 టీస్పూన్,ఉప్పు తగినంత,నూనె 3 టీస్పూన్లు, Instructions: Step 1 గోధుమలు సన్నగా రవ్వలా విసురుకోవాలి. లేదా గోధుమరవ్వ బజారులో దొరికేది తెచ్చుకోవచ్చు.  Step 2 కడాయి వేడి చేసి ఈ రవ్వను దోరగా పచ్చివాసన పోయే వరకూ వేయించాలి.  Step 3 గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మెత్తబడేవరకూ వేపాలి.  Step 4 ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారంపొడి వేసి కొద్దిగా వేపి 3 కప్పుల నీళ్ళు పోయాలి.  Step 5 ఇందులో సన్నగా తరిగిన కొత్తిమిర, తగినంత ఉప్పు వేయాలి.  Step 6 నీళ్లు మరుగుతున్నప్పుడు వేయించిన రవ్వ కలిపి నిదానంగా ఉడికించాలి. చివర్లో మంట పూర్తిగా తగ్గించి మూత పెట్టి మగ్గనివ్వాలి.  Step 7 తర్వాత దింపేసి ఇష్టముంటే కాస్త నెయ్యి, నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇందులో టమాటా లేదా వేరే కూరగాయలు కూడా వేసి చేసుకోవచ్చు.
Yummy Food Recipes
Add