bengali fish kalia By , 2018-05-12 bengali fish kalia Here is the process for bengali fish kalia making .Just follow this simple tips Prep Time: 30min Cook time: 35min Ingredients: రఘుఫిష్ (కావాల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి) - 4 pieces,బంగాళదుంపలు - 2 medium sized (cut into quarters),ఉల్లిపాయలు - 2 (finely chopped),టమోటోలు - 1 (finely chopped),నిమ్మరసం - 1 teaspoon,పెరుగు - 1 teaspoon,పచ్చిమిర్చిపేస్ట్ - 2 teaspoon,ఆవనూనె - 4-5 teaspoon,అల్లం పేస్ట్ - 2 teaspoon,వెల్లుల్లిపేస్ట్ - 2 teaspoon,టమోటో గుజ్జు - 1 teaspoon,పసుపు - 1/4 teaspoon,జీలకర్ర పొడి - 1 teaspoon,కారం - According to taste,ఉప్పు - According to taste,పంచదార - 1 teaspoon,గరం మసాలా - 1/2 teaspoon,బిర్యానీ ఆకు- 2,మసాలా దినుసులు - (దాల్చిన చెక్క: 1 small piece, లంగాలు: 2, యాలకలు: 2),ఎండుమిర్చి - 1 (optional),ఫ్లేవర్ కోసం (జీలకర్ర, సోంపు, మెంతి, కలోంజి, ఆవాలు) - 1/4 teaspoon,నెయ్యి - ½ TSP,నీళ్ళు,కొత్తిమీర గార్నిష్ కోసం, Instructions: Step 1 ముందుగా చేపముక్కలను బాగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. Step 2 తడి ఆరిన తర్వాత వాటికి ఉప్పు, పసుపు, పెరుగు, మరియు నిమ్మరసం చేర్చి బాగా మిక్స్ చేసి 20 నిముషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.తర్వాత పాన్ లో ఆవనూనె వేసి వేడి చేయాలి.  Step 3 నూనె వేడి అయ్యాక అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చేపముక్కలను వేసి 5నిముషాలు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.  Step 4 ఇప్పుడు బంగాళదుంపలను బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసి పెట్టుకోవాలి . తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.   Step 5 తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి, మరియు పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. ఇప్పుడు అందులోనే జీలకర్ర, సోంపు, మెంతి, కలోంజి, ఆవాలు, ఎండు మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.   Step 6 ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులో పసుపు, జీలకర్ర, మరియు కారం , సరిపడా నీళ్ళు సోయాలి.    Step 7 ఈ మిశ్రమాన్ని మీడియం మంట మీద బాయిల్ చేయాలి . తర్వాత అందులోనే టమోటో గుజ్జు కూడా వేసి ఉడికించుకోవాలి. దాంతో ఆయిల్ వేరుపడుతుంది.   Step 8 ఈ మసాలాలతోనే బంగాళదుంప చేర్చి బాగా ఉడికించుకోవాలి . దాంతో మసాలన్నీ కూడా బంగాళదుంపలకు బాగా పడుతాయి . తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి ఉడికించుకోవాలి.   Step 9 బంగాళదుంప మెత్తగా ఉడికిన తర్వాత 1/2 వాటర్ వేసి ఉడికించుకోవాలి. బంగాళదుంపలు మెత్తగా ఉడికిన తర్వాత అందులో చేపముక్కలు మరియు సన్నగా తరిగిన టమోటో ముక్కలు వేసి 5నిముషాలు ఉడికించుకోవాలి.   Step 10 చేపముక్కలు మీడియంగా ఉడికినట్లు తెలియగానే స్టౌ ఆఫ్ చేయాలి .  తర్వాత గరం మసాలా కొద్దిగా చిలకరించి బాగా మిక్స్ చేయాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే బెంగాలి ట్రెడిషినల్ ఫిష్ కాలీ రిసిపి రెడీ.  
Yummy Food Recipes
Add