Chicken Meatball Tacos By , 2018-07-03 Chicken Meatball Tacos Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Chicken Meatball Tacos making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: చికెన్‌ -250 గ్రాములు,పచ్చిమిర్చి తరుగు-2 టేబుల్‌ స్పూన్లు,మిరియాలపొడి- 1 టేబుల్‌ స్పూన్‌,ఉప్పు-చిటికెడు,కొత్తిమీర తరుగు-1 టేబుల్‌ స్పూన్‌,అల్లం వెల్లుల్లి పేస్ట్‌-1 టేబుల్‌ స్పూన్‌,నూనె-సరిపడా,ట్యాకో షెల్స్‌-8(బజార్లో దొరుకుతాయి),జున్ను-1కప్పు,ఉడికించిన బీన్స్‌-1/2 కప్పు,క్రీమ్‌-1/2 కప్పు,క్యాబేజ్‌-1,ఉల్లిపాయ-1,కొత్తిమీర తరుగు-1/4 కప్పు, Instructions: Step 1 ముందుగా చికెన్‌ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్‌చేసి ఉడికించుకోవాలి.  Step 2 ఒక బౌల్‌ల్లో పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, ఉడికించిన చికెన్‌ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. Step 3 స్టౌవ్‌పై బాణలి వుంచి నూనె వేసి వేడెక్కిన తర్వాత చికెన్‌ బాల్స్‌ని వేయించుకోవాలి.  Step 4 గోధుమరంగు వచ్చే వరకు వేయించి ఒక ప్లేట్‌లోకి తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మందపాటి పాత్రలో కొద్దిగా నూనె వేసి స్టౌపై వుంచి వేడెక్కనివ్వాలి. అందులో వెల్లుల్లి రెబ్బలు, వేసి వేయించుకోవాలి. Step 5 తర్వాత బీన్స్‌ ముక్కలు, ఉల్లి తరుగు, జీలకర్ర, ఉప్పు, వేసి పేస్ట్‌లా ఉడికించుకోవాలి.  Step 6 ఇప్పుడు ట్యాకోస్‌లో బీన్స్‌ మిశ్రమం, చికెన్‌ బాల్స్‌, జున్ను వుంచి వాటిని కొంతసేపు మగ్గనివ్వాలి.  Step 7 జున్ను కరిగిన వెంటనే బయటకు తీసి వాటిపై కొద్తిగా క్రీమ్‌ని చేర్చాలి. చివరిగా ఉల్లితరుగు, కొత్తిమీర తరుగుతో గార్నిష్‌ చేస్పే చికెన్‌ మీట్‌బాల్స్‌ ట్యాకోస్‌ రెడీ!
Yummy Food Recipes
Add
Recipe of the Day