chicken bites recipe cooking tips snacks special By , 2014-12-23 chicken bites recipe cooking tips snacks special chicken bites recipe cooking tips snacks special : the cooking tips to make chicken bites recipe. It is simple to make but have to take some care while preparing this one. Prep Time: 45min Cook time: 30min Ingredients: 350 గ్రాములు బోన్’లెస్ చికెన్ (ముక్కలుగా చేసుకోవాలి), 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలపొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రపొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరంమసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం, వెల్లుల్లి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, 1 కప్ ఉల్లికాడల తరుగు, 1-2 గుడ్లు, వంటకానికి సరిపడేంత నూనె, 1/2 కప్ టమోటా కెచప్, 1 కప్ నీళ్లు, రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వాటిని ఒక పాత్రలో వేసుకోవాలి. అలాగే అందులోనే గుడ్డుసొన ధనియాలపొడి, జీలకర్రపొడి, కారం, గరం మసాలా, మిరియాలపొడి, మైదా మొక్కజొన్న పిండి, కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు తదితర పదార్థాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. 10 నిముషాలపాటు అలాగే మొత్తం మిశ్రమాన్ని వదిలేయాలి. Step 2 ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో ఇదివరకు మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇలా చికెన్ ముక్కలు అయిపోయేంతవరకు వేయించుకోవాలి. Step 3 అనంతరం మరో పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. 2 నిముషాల తర్వాత అందులో ఇదివరకు వేయించిన చికెన్ ముక్కలతోబాటు టమోటా కెచప్ వేసి మళ్లీ వేయించాలి. Step 4 బాగా వేయించిన తర్వాత అందులో కొద్దిగా నీళ్లు చల్లి వేయించి... 2,3 నిముషాల తర్వాత దించేయాలి. అంతే! వేడివేడి చికెన్ బిట్స్ రెడీ! వీటిని చపాతిలోకి సైడ్ డిష్’గా గానీ లేక భోజనంలోకి సైడ్ డిష్’గా గానీ తీసుకోవచ్చు.
Yummy Food Recipes
Add