ulava masala curry (horse gram) By , 2014-08-09 ulava masala curry (horse gram) ulava masala curry (horse gram) - its a traditional recipe, healthy and tasty ulava masala curry easy preparation.... Prep Time: 15min Cook time: 35min Ingredients: పావు కప్పు ఉలవలు, పావుటీస్పూన్ పసుపు, అరటీస్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాల, 1 టమాట, 2 టేబుల్ స్పూన్లు నూనె, 1 ఉల్లిపాయ, తగినంత ఉప్పు, అరకప్పు కొబ్బరితురుము, 1 టేబుల్ సూన్ ఎండుకొబ్బరి ముక్కలు, చిన్నముక్క అల్లం, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ వాము, అరటేబుల్ స్పూన్ ధనియాలు, Instructions: Step 1 ఉలవలను ముందు రోజు రాత్రి నానపట్టుకోవాలి. Step 2 మరుసటి రోజు ఉదయం ఈ ఉలవలను కొద్దిగ ఉప్పువేసి ఉడికించుకుని పెట్టుకోవాలి. Step 3 పచ్చికొబ్బరి, ఎండుకొబ్బరి, అల్లం, వెల్లుల్లి, వాము, ధనియాలు, ఉల్లిపాయలు అన్నీ విడివిడిగా నూనెలో వేయించుకుని గ్రైండ్ చేసుకోవాలి. Step 4 ఇప్పుడు పాన్ లో నూనె వేడి చేసి అందులో ఉల్లిమిక్కలు, పసుపు, కారం, గరం మసాల వేసి మగ్గలించాలి. Step 5 టమాటాలు మగ్గిన తరువాత ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిమిశ్రమం, ఉడికించుకున్న ఉలవలు వేసి ఉడికించాలి. కూర పూర్తిగా ఉడికిన తరువాత చివరగా కొత్తిమీర వేసి దించాలి. అంతే రుచికరమైన ఉలవ మసాల కర్రీ రెడీ
Yummy Food Recipes
Add
Recipe of the Day