kaju halwa recipe bakrid special sweet By , 2014-12-15 kaju halwa recipe bakrid special sweet kaju halwa recipe bakrid special sweet : the making of kaju halwa recipe which is very special sweet for muslims on bakrid Prep Time: 20min Cook time: 15min Ingredients: 1 లీటర్ పాలు, 250 గ్రాములు కాజు (జీడిపప్పు - సన్నగా తరగాలి), 4-5 టీ స్పూన్స్ పంచదార, 2-3 టీ స్పూన్స్ నెయ్యి లేదా బట్టర్, కొద్దిగా కుంకుమపువ్వు, Instructions: Step 1 ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి, అది బ్రౌన్ కలర్’లోకి వచ్చేంతవరకూ ఉడికించుకోవాలి. కలర్ మారిన తర్వాత దానిని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. Step 2 మరొక గిన్నె తీసుకుని అందులో తగిన పరిమాణంలో పాలు తీసుకోవాలి. దానిని తక్కువ మంట మీద వేడి చేసుకోవాలి. కొద్దిగా వేడెక్కి పాలు పొంగు రాగానే అందులో పంచదార వేసి మిక్స్ చేయాలి. 2 నిముషాల తర్వాత అందులో కుంకుమపువ్వు వేసి మిక్స్ చేస్తే ఒక డిఫరెంట్ కలర్ వస్తుంది. Step 3 మరోవైపు జీడిపప్పు కాస్త వేడి చేసుకుని దానిని చల్లార్చిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్’ను ఇదివరకు వేడిగా వున్న ఆ పాలమిశ్రమంలో వేసి, తక్కువ మంటమీద నిదానంగా మిక్స్ చేస్తూ వుండాలి. Step 4 మీడియం మంటమీద కొద్దిసేపటివరకు పాలు-జీడిపప్పు మిశ్రమాన్ని బగా ఉడికించాలి. అప్పుడు అది చిక్కగా మారుతుంది. అంతే.. ఈ విధంగా కాజు హల్వాను రెడీ చేసుకుని అందరికీ సర్వ్ చేసుకోవచ్చు.
Yummy Food Recipes
Add