maramarala pulav By , 2018-05-20 maramarala pulav Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty maramarala pulav making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: మరమరాలు 500 గ్రాములు,బంగాళాదుంపలు 2,క్యారెట్ దుంపలు 2,ఉల్లిపాయలు 2,క్యాబేజీ సగం,అల్లం వెల్లుల్లి 8 రేకలు,జీడిపప్పు కొద్దిగా,పచ్చిబఠానీలు కొద్దిగా,లవంగాలు 6,దాల్చినచెక్క 2 ముక్కలు,నెయ్యి 8 టీ స్పూనులు,ఉప్పు తగినంత, Instructions: Step 1 ముందుగా మరమరాలను నీళ్ళలో కడిగి, వెంటనే నీళ్ళను పిండేసి, పళ్ళెంలో పోసుకోవాలి. Step 2 తరువాత బంగాళాదుంపల చెక్క తీసి, ముక్కలుగా కోసుకోవాలి. Step 3 క్యారెట్, ఉల్లిపాయలు, క్యాబేజీని కూడా శుభ్రం చేసి ముక్కలుగా కోసుకోవాలి. Step 4 అల్లం, వెల్లుల్లిలను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. పచ్చి బఠానీలను కొంచెం సేపు నీటిలో నానబెట్టాలి. Step 5 తరువాత ఒక బాణలిలో నెయ్యి పోసి స్టౌ మీద వేడి చేయాలి.  Step 6 ఇందులో ముందుగా జీలకర్ర, దాల్చిచెక్క ముక్కలు, లవంగాలు, అల్లం, వెల్లుల్లి ముక్కల్ని వేసి వేయించాలి Step 7 తరువాత నానిన పచ్చి బఠానీలను, కూరగాయల ముక్కలను వేసి సన్నని మంట మీద వేయించాలి. Step 8 కూరగాయల ముక్కలు, మెత్తబడిన తరువాత అందులో మరమరాలను, తగినంత ఉప్పును వేసి బాగా కలియబెట్టాలి. Step 9 రెండు నిమిషాలు గడిచాక బాణాలిని స్టౌ మీద నుంచి కిందకు దించుకోవాలి. దీనితో మధురాతిమధురమైన మరమరాల పలావు రెడి
Yummy Food Recipes
Add