moong dal burfi By , 2018-01-10 moong dal burfi Here is the process for moong dal burfi making .Just follow this simple tips Prep Time: 1hour 20min Cook time: 30min Ingredients: పెసరపప్పు - ఒక కప్పు,,కోవా - కప్పు,,చక్కెర - అరకప్పు,,నెయ్యి - ముప్పావు కప్పు,,కిస్ మిస్ - గుప్పెడు, Instructions: Step 1 పెసరపప్పును మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి. అనంతరం నీళ్లు తీసేసి పెసరపప్పును ముద్దలా చేసుకోవాలి.  Step 2 ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేసి, అది కరిగాక పెసరపప్పు ముద్ద వేసి బాగా కలపాలి. మంట తక్కవగా పెట్టాలి.  Step 3 పెసరపప్పు ముద్ద ఉడికే వరకు ఉంచాలి. కమ్మటి వాసర రావడం, ముద్ద రంగు మారడమనేది బాగా ఉడికిందనడానికి సంకేతం. ముద్ద ఉడికాక దించేయాలి.  Step 4 ఇప్పుడు స్టవ్ మీద మరో కళాయి పెట్టి అందులో కోవా వెయ్యాలి. అది కాస్త వేడిగా అయ్యాక ఈ పెసరపప్పు ముద్దని వేసి బాగా కలపాలి.    Step 5 ఈ మిశ్రమం కాస్త ఉడికి దగ్గరగా చేరుకుంటుంది. ఈలోపు చక్కెర లేత పాకంగా చేసి దానిని కోవా-పెసర ముద్దలో వేసి బాగా కలిపేయాలి.    Step 6 ఈ మిశ్రమమంతా దగ్గరగా అయ్యే వరకు స్టవ్ మీద ఉంచాలి.    Step 7 మిశ్రమం దగ్గరకు చేరాక స్టవ్ కట్టేయాలి. దానికి పళ్లెంలో వేసి కిస్ మిస్ చల్లి, బర్ఫీల్లా ముక్కలుగా కోసుకుంటే సరి. పెసరపప్పుతో తీయటి బర్ఫీ సిద్ధమైనట్టే.          
Yummy Food Recipes
Add