mango icecream recipe making special seasonal food By , 2014-12-17 mango icecream recipe making special seasonal food mango icecream recipe making special seasonal food : the making of mango ice cream which is available only in summer occassions. It is different from other drinks in tastes and contains some healthy ingredients which improves the immunity levels. Prep Time: 30min Cook time: 45min Ingredients: 500 మి.లీ. హోల్ మిల్క్, 250 గ్రాములు మ్యాంగో పల్స్, 50 గ్రాములు స్కిమ్డ్ మిల్క్ పౌడర్, 250 గ్రాములు క్రీమ్ (30 శాతం ఫ్యాట్ వున్నది), 150 గ్రాములు పంచదార, Instructions: Step 1 ముందుగా స్టౌవ్ మీద ఒక మిల్క్ బాయిలర్’ను పెట్టి అందులో పాలు పోసి (80 డిగ్రీల సెంటిగ్రేడ్’లో) బాగా మరగనివ్వాలి. Step 2 మరొక పాత్ర తీసుకుని అందులో పంచదార, స్కిమ్డ్ మిల్క్ పౌడర్’ని వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో నెమ్మదిగా వేస్తూ... బాగా కలియబెట్టాలి. అలాగే ఈ పాలమిశ్రమంలో క్రీమ్ వేస్తూ కలుపుతూ వుండాలి. ఇలాగే ఈ మిశ్రమాన్ని చిక్కబడేలా వేగించాలి. Step 3 మరోవైపు ఒక వెడల్పాటి గిన్నెను తీసుకుని అందులో నీళ్లు పోసి.. చిక్కబడిన పాలమిశ్రమం వున్న గిన్నెను ఆ నీళ్లలో పెట్టి చల్లారనివ్వాలి. (ఎంత త్వరగా చల్లారితే ఐస్’క్రీమ్ అంత మృదువుగా వస్తుంది) Step 4 ఇలా పాలమిశ్రమాన్ని చల్లార్చిన అనంతరం అందులో మ్యాంగో పల్స్ వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సర్’లో 15 నిముషాల వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసిన ఈ మిశ్రమాన్ని ఒక ఐస్’క్రీమ్ పాత్రలో వేసుకొని డీప్ ఫ్రీజర్’లో పదిగంటలపాటు పెట్టాలి. అంతే! మ్యాంగో ఐస్’క్రీమ్ రెడీ!
Yummy Food Recipes
Add