brown rice dosa recipe making healthy breakfast food By , 2014-12-12 brown rice dosa recipe making healthy breakfast food brown rice dosa recipe making healthy breakfast food : the brown rice dosa is one of the healthiest breakfast food recipe which increase the immunity levels. Prep Time: 20min Cook time: 10min Ingredients: 3 - 4 కప్స్ బ్రౌన్ రైస్ (ఎర్రబియ్యం), 1 కప్ ఉద్దిపప్పు, 1 కప్ అటుకులు, 1/2 కప్ కందిపప్పు, 1/2 కప్ శెనగపప్పు, 1/2 కప్ పెసరపప్పు, 1 టీ స్పూన్ మెంతులు, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా నూనె, Instructions: Step 1 ముందుగా తీసుకున్న బ్రౌన్ రైస్ (ఎర్రబియ్యం), ఉద్దిపప్పు, శెనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు తదితర పదార్థాలను నీటిలో శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం వాటన్నింటిని ఒక పాత్రలో మిశ్రమం చేసి.. తగినంత నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. Step 2 ఇక ఉదయాన్నే అటుకులను ఒక గంటపాటు నీటిలో నానబెట్టాలి. అనంతరం ఈ అటుకులతోబాటు రాత్రంతా నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ మిశ్రమం, పప్పు అన్ని ఒక మిక్సీ జార్’లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. బాగా గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి మరోసారి మిక్స్ చేయాలి. తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసి, దోసెపిండిలా కలుపుకుని, గది ఉష్ణోగ్రతలో 10 గంటలపాటు అలాగే వదిలేయాలి. (ఇలా చేస్తే పిండి పులుస్తుంది. అప్పుడు దోసె వేస్తే టేస్టీగా, క్రిస్పీగా వస్తుంది) Step 3 అలా 10 గంటలపాటు వుంచిన తర్వాత స్టౌవ్ మీద తవా పెట్టి దానిపై నూనె బాగా రాయాలి. అనంతరం గరిటతో పిండిని తీసుకుని తవా మీద వేసి గుండ్రంగా దోసెలాగా వేయాలి. అప్పుడు మంటను మీడియంలో పెట్టి.. దోసెకు రెండువైపులా బ్రౌన్ కలర్’లోకి వచ్చేంతవరకు కాల్చుకోవాలి. అంతే.. బ్రౌన్ రైస్ దోసె రెడీ!
Yummy Food Recipes
Add