aloo gobi recipe making healthy food By , 2014-12-11 aloo gobi recipe making healthy food aloo gobi recipe making healthy food : the aloo gobi recipe is best to take in lunch and dinner which prevents the heart disease. Prep Time: 20min Cook time: 15min Ingredients: 4 - 5 బంగాళదుంపలు (ఉడికించి పొట్టు తీసేయాలి), 1 కాలీఫ్లవర్ (చిన్నగా తరిగి ఉడికించుకోవాలి), 3 - 4 టమోటా (సన్నగా తరిగినవి), 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 2 - 3 టేబుల్ స్పూన్స్ నూనె, 1 బిర్యానీ ఆకు, 1 కప్ నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పంచదార, తగినంత కొత్తిమీర తరుగు (గార్నిష్ కోసం), Instructions: Step 1 బంగాళదుంపలను నీటిలో బాగా ఉడికించుకుని, పొట్టు క్లియర్’గా తీసేయాలి. అలాగే కాలీఫ్లవర్’ను చిన్నగా తరిగి, కడిగిన అనంతరం ఉడికించుకోవాలి. ఈ రెండింటిని పక్కన పెట్టుకోవాలి. Step 2 స్టౌవ్ మీద పాన్’ను పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. కాగిన అనంతరం అందులో జీలకర్ర, బిర్యానీ ఆకువేసి మళ్లీ వేగించాలి. తర్వాత అందులోనే అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి, కొద్దిసేపటివరకు వేగించుకోవాలి. Step 3 ఇప్పుడు అందులోనే ఇదివరకే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని, కాలీఫ్లవర్స్’ను వేసి బాగా కలియబెట్టి, ఐదారు నిముషాలు ఫ్రై చేయాలి. అలా చేస్తూనే అందులోనే పసుపు, కారం, పంచదార, జీలకర్రపొడి తదితర పదార్థాలు వేసి కొద్దిసేపటివరకు ఫ్రై చేయాలి. Step 4 అలా ఫ్రై చేసిన తర్వాత అందులో ఒక కప్పు నీళ్లు పోసి మిక్స్ చేయాలి. తర్వాత పాత్రకు మూతపెట్టి మరికొద్దిసేపటివరకు మీడియం మంటమీద వేడి చేయాలి. అనంతరం కొత్తిమీద తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే.. ఆరోగ్యకరమైన ఆలూ-గోబీ రిసిపీ రెడీ!
Yummy Food Recipes
Add