White Spiced Coffee making special hot drink By , 2014-12-15 White Spiced Coffee making special hot drink White Spiced Coffee making special hot drink : white spiced coffee drink is the special one which is different than other beverages of coffee. Prep Time: 15min Cook time: 15min Ingredients: 3 కప్స్ (750 మి.లీ) పాలు, 1 కప్ కాఫీ గింజెలు (ఆర్గానిక్) (సేంద్రీయ) (పిండిగా చేయాలి), 3 అంగుళాలు దాల్చిన చెక్క, 4 గ్రీన్ ఏలకులు ప్యాడ్లు, 1/4 కప్ తేనె, 2 టీ స్పూన్స్ డార్క్ రమ్, Instructions: Step 1 ఒక పాన్ తీసుకుని అందులో పాలు, పొడిగా చేసుకున్న కాఫీ బీన్స్ వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మీడియం మంట మీద 10 నిముషాలవరకు వేడి చేయాలి. వేడి చేసిన వెంటనే మంటమీద నుంచి తీసేసి.. కాఫీ బీన్స్ పాలలో పూర్తిగా మరిగేంతవరకూ 15 నిముషాలపాటు పక్కన పెట్టేయాలి. Step 2 అలా చేసిన అనంతరం ఆ కాఫీ మిశ్రమాన్ని ఒక జార్’లో వడబోసుకోవాలి. అప్పుడు కాఫీ బీన్స్ అందులో నుంచి తొలగిపోతాయి. ఆ బీన్స్’ను పక్కన పెట్టేసి వడబోసిన కాఫీలో దాల్చిన చెక్క, ఏలకులు, తేనె జోడించాలి. అలా కలిపిన ఈ సుగంధద్రవ్యాలు కొద్దిసేపటి అనంతరం ఆ గిన్నె కింద భాగానికి చేరిపోతాయి. Step 3 అప్పుడు మళ్లీ ఈ మిశ్రమాన్ని వడపోసుకుంటే.. క్రింది భాగంలో వున్న సుగంధద్రవ్యాలన్నీ తొలగిపోతాయి. అలా తీసిన తర్వాత ఈ కాఫీని కొద్దిసేపటివరకు మీడియం మంట మీద వేడి చేసుకోవాలి. అంతే! వైట్ స్పైస్డ్ కాఫీ రెడీ! ఇందులో అవసరమైతే కాస్త రమ్ కూడా కలుపుకోవచ్చు.
Yummy Food Recipes
Add