Chilagadadumpa Parota By , 2018-04-21 Chilagadadumpa Parota Here is the process for Chilagadadumpa Parota making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: చిలగడదుంపలు - ఒక కప్పు (ఉడికించి, మెదిపి),,గోధుమపిండి - రెండు కప్పులు,,నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్,,ఉప్పు- రుచికి సరిపడా,,నూనె - వేగించడానికి సరిపడా.,,కారపు ముద్ద:,పచ్చిమిర్చి - నాలుగు,,అల్లం - చిన్న ముక్క,,కొత్తిమీర, పుదీనా - కొద్దిగా., ,పొడి మసాలా:,ధనియాలు- జీలకర్ర పొడి - రెండు టీస్పూన్లు,,ఆమ్‌చూర్ పొడి- ఒక టీస్పూన్,,గరం మసాలా - అర టీస్పూన్., Instructions: Step 1 గోధుమపిండిలో చిటికెడు ఉప్పు, రెండు టీస్పూన్ల నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి గట్టి ముద్దలా కలపాలి.  Step 2 మెదిపిన చిలగడదుంపల్లో పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, పుదీనా, ధనియాలు-జీలకర్ర పొడి, ఆమ్‌చూర్ పొడి, గరం మసాలాలతో పాటు నిమ్మరసం, ఉప్పు వేసి మెత్తటి ముద్దలా కలపాలి.  Step 3 ఈ ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టాలి. ముందు కలిపి పెట్టిన పిండి ముద్ద నుంచి కొంచెం పిండిని తీసుకుని, నూనె చేతులకి రాసుకుని కప్పు ఆకారంలో చేయాలి.  Step 4 ఇందులో చిలగడదుంప ఉండని ఉంచి కప్పుని మూసేసి చదునుగా చేసి పరాఠాలా ఒత్తాలి.  Step 5 తరువాత పెనం మీద వేసి ఓ మాదిరిమంట మీద రెండువైపులా కాల్చాలి. తరువాత వాటికి నెయ్యి పూసి మంట పెంచి ముదురు రంగు వచ్చే వరకు వేగించాలి.  Step 6 ఈ పరాఠాల్ని వేడివేడిగా నచ్చిన చట్నీతో లాగించొచ్చు.    
Yummy Food Recipes
Add