Sorakaya tepla By , 2018-04-20 Sorakaya tepla Here is the process for Sorakaya tepla making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: సొరకాయ తురుము - ఒక కప్పు,,గోధుమపిండి - ఒక కప్పు,,పచ్చిమిర్చి (సన్నగా తరిగి)- ఒకటి,,ఉప్పు -ముప్పావు స్పూన్,,నూనె -ఒక టీస్పూన్,,కొత్తిమీర తురుము - ఒక టేబుల్ స్పూన్,,కసూరి మెంతి - ఒక టేబుల్‌స్పూన్,,కారం - పావు టీస్పూన్,,పసుపు - రెండు చిటికెలు,,చాట్ మసాలా - పావు టీస్పూన్,,గోధుమ పిండి - మూడు టేబుల్ స్పూన్‌లు,,నెయ్యి లేదా నూనె - రెండు టేబుల్‌స్పూన్‌లు (తెప్లా పైన పూసేందుకు), Instructions: Step 1 గోధుమపిండిలో సొరకాయ తురుము, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తురుము, కసూరిమెంతి, కారం, పసుపు, చాట్ మసాలా, నూనె వేసి ముద్దలా కలపాలి.  Step 2 సొరకాయలో నీళ్లు ఉంటాయి కాబట్టి పిండి కలిపేటప్పుడు ప్రత్యేకించి నీళ్లు పోయనక్కర్లేదు.  Step 3 ఒకవేళ పిండి మరీ జారుగా అయితే మరికొంచెం గోధుమపిండి కలపండి.  Step 4 మెత్తటి ముద్ద తయారుచేసుకున్న తరువాత దాన్నుంచి పది చిన్న చిన్న ఉండలు చేయాలి. Step 5 ఆ తరువాత రొట్టెల పెనాన్ని వేడి చేయాలి.  Step 6 అది వేడెక్కుతుండగానే గోధుమపిండిలో ఉండల్ని దొర్లించి రొట్టెల కర్రతో నాలుగైదు అంగుళాల వెడల్పులో గుండ్రంగా వత్తాలి. Step 7 వీటిని వేడెక్కిన పెనం మీద వేసి ఎర్రటి మచ్చలు వచ్చే వరకు కాల్చాలి.  Step 8 ఆ తరువాత రెండో వైపు తిప్పి పైన నూనె పూసి చివర్లను గరిటెతో నొక్కుతూ కాల్చాలి. ఇలానే రెండో వైపు కూడా చేయాలి.  Step 9 రెడీ అయిన తెప్లాలను మీకు నచ్చిన కూర లేదా పచ్చడితో తినొచ్చు. ప్రయాణాల్లో వీటిని వేడివేడి టీతో కలిపి తిన్నా బాగుంటాయి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day