punjabi dal tadka recipe making healthy lunch dinner food By , 2014-12-11 punjabi dal tadka recipe making healthy lunch dinner food punjabi dal tadka recipe, punjabi special food items, cooking tips, healthy food recipes Prep Time: 20min Cook time: 20min Ingredients: 1/2 కప్ పెసరపప్పు, 2 - 4 టమోటాలు (తరిగినవి), 1 లేదా అర అంగుళం అల్లం (ముక్కలుగా కట్ చేయాలి), 1 లేదా 2 ఉల్లిపాయలు (సన్నగా కట్ చేయాలి), 2 - 4 పచ్చిమిర్చి (సన్నగా తరిగినవి), 2 - 3 ఎండుమిర్చి, 1 లేదా 2 బిర్యానీ ఆకులు, 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర తరుగు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ నూనె, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ, రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 స్టౌవ్ మీద ప్రెజర్ కుక్కర్ తీసుకుని అందులో కాస్త నూనె వేసి వేడి చేయాలి. బాగా వేడైన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. కొద్దిసేపటి తర్వాత మీడియం మంట మీద వేగిస్తూ.. అల్లం తురుము వేయాలి. అనంతరం కొద్దిగా ఉప్పు, టమోటా ముక్కలను వేసి 5 నిముషాల వరకు మీడియం మంట మీద ఫ్రై చేయాలి. Step 2 అలా ఫ్రై చేసిన తర్వాత ఇదివరకే కడిగి పక్కన పెట్టుకున్న పెసరపప్పును ఆ కుక్కర్’లో వేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసిన అనంతరం అందులో పసుపు, 3 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి చేయాలి. 3 లేదా 4 విజిల్స్ వచ్చేవరకూ మీడియం మంట మీద పెట్టి వదిలేయాలి. Step 3 మరోవైపు ఒక డీప్ బాటమ్ పాన్’ను తీసుకుని అందులో కొద్ది నెయ్యి వేసి వేడి చేయాలి. కాగిన తర్వాత అందులో ఇంగువ, జీలకర్ర, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు వేసి కొద్దిసేపటివరకు వేగనివ్వాలి. తర్వాత ఆవాలు, పచ్చిమిర్చి మళ్లీ వేడిగా ఉడికించాలి. Step 4 అలా వేడిన చేసిన తర్వాత అందులో ఇదివరకే కుక్కర్’లో వేడి చేసి పెట్టుకున్న పప్పును వేసి మిక్స్ చేసి కలియబెట్టాలి. అనంతరం కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే.. పంజాబీ దాల్ తడ్కా రెడీ!
Yummy Food Recipes
Add