kobbari bobbatlu By , 2018-04-15 kobbari bobbatlu Here is the process for kobbari bobbatlu making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 35min Ingredients: కొబ్బరికాయలు - 2,,మైదా - అర కేజి,,బెల్లం లేదా పంచదార - పావుకేజి,,యాలకులు - 3,,నూనె లేదా నెయ్యి - 100 గ్రా,,గసగసాలు - 100 గ్రా., Instructions: Step 1 ముందుగా మైదాపిండిలో నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలిపి రెండు గంటలు నాననివ్వాలి.  Step 2 తరువాత కొబ్బరి, బెల్లం తురుముకొని, రెండింటినీ ఒక గిన్నెలో వేసి ఉడికించాలి.  Step 3 కొబ్బరి, బెల్లం ఉడికి ముద్దలా అయి తీగపాకం వచ్చాక దించాలి. తర్వాత బాగా మెదిపి యాలకుల పొడి, దోరగా వేయించిన గసగసాలు వేయాలి.  Step 4 ఇప్పుడు ఈ కొబ్బరి ముద్దను నిమ్మకాయ సైజులో ముద్దలుగా చేసుకోవాలి.   Step 5 నానబెట్టిన మైదాపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, ఒక్కోదాన్ని చిన్న పూరీలా ఒత్తి, అందులో కొబ్బరి ముద్ద పెట్టి పూరీతో చుట్టేసి చేత్తో లేదా అప్పడాల కర్రతో సున్నితంగా వత్తాలి.  Step 6 వీటిని బొబ్బట్ల మాదిరిగానే పెనం మీద నెయ్యి లేదా నూనె వేసి రెండు వైపులా దోరగా కాల్చాలి. అంతే కొబ్బరి బొబ్బట్లు రెడీ.  
Yummy Food Recipes
Add
Recipe of the Day