tuna-fish-cutlets By , 2018-04-12 tuna-fish-cutlets Here is the process for tuna-fish-cutlets making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 35min Ingredients: తున ఫిష్- 2 small tins,ఉల్లిపాయలు- 2పెద్దవి (సన్నగా తరిగి పెట్టుకోవాలి),పచ్చిమిర్చి- 5 (సన్నగా తరిగిపెట్టుకోవాలి),కరివేపాకు- 3 రెమ్మలు(సన్నగా తరిగిపెట్టుకోవాలి),అల్లం - 2tbsp(సన్నగా తరిగిపెట్టుకోవాలి),వెల్లుల్లి: - 1tsp (సన్నగా తరిగిపెట్టుకోవాలి),కారం- ½ tsp,పసుపు- ¼ tsp,మిరియాలపొడి- ½ tsp,గరం మసాలా- ½ tsp,నూనె- 2tbsp (వేడిచేయాలి),గుడ్లు- 1-2 (బాగా గిలకొట్టాలి),బంగాళదుంప- 1 (చిన్నసైజు, ఉడికించి మ్యాస్ చేసుకోవాలి),బ్రెడ్ పొడి: కోటింగ్ కోసం డీప్ ఫ్రై చేయడానికి :,నూనె గరం మసాలా పొడి కోసం:,లవంగాలు- 2tbsp,యాలకలు- 2tbsp,యానీసీడ్- 2tbsp,దాల్చిన చెక్క- 3 small sticks, Instructions: Step 1 ముందుగా గరం మసాలా కోసం సిద్దం చేసుకొన్న వాటినన్నింటిని డ్రై రోస్ట్ చేసుకొని, చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.  Step 2 తర్వాత చేపలను శుభ్రంగా కడిగి, నీరు పూర్తిగా వంపేసి, తడి ఆరేవరకూ పక్కన పెట్టుకోవాలి. తర్వాత సన్నని ముక్కలుగా చేయాలి. లేదా ముల్లు తొలగించి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.  Step 3 ఇప్పుడు రెండు చెచాల నూనెను పాన్ లో పోసి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, మరియు కరివేపాకు వేసి రెండు మూడు నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.  Step 4 ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి అందులోనే పసుపు, కారం, పెప్పర్ పౌడర్, మరియు గరం మసాలా వేసి మరో 3 నిముషాలు ఫ్రై . Step 5 అలాగే రుచికి సరిపడా ఉప్ప వేసి బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే మెత్తగా చేసి పెట్టుకొన్ని చేపపదార్థాన్ని వేసి మొత్త మిశ్రమాన్ని కలగలుపుతూ తేమ లేకుండా ఫ్రై చేయాలి.  Step 6 ఇలా చేసిన తర్వాత స్టౌ మీద నుండి క్రిందికి దుంపుకొని, చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత వీటిని రౌండ్ షేప్ లో అరచేతిలో పెట్టుకొని వడలా తట్టుకోవాలి. చేప నూనెతో లాభనష్టాలు తెలుసుకోండి..!  Step 7 ఇలా ప్రిపేర్ చేసి కట్ లెట్ ను బాగా గిలకొట్టి పెట్టుకొన్న ఎగ్ లో డిప్ చేసి ప్లేట్ లో ఉన్న బ్రెడ్ పొడిలో వేసి ప్లొరించాలి. అన్నివైపులు బ్రెడ్ పొడి అంటుకొనేలా చేయలి ఇప్పుడు డీఫ్ ఫ్రైకి సరిపడా నూనె పాన్ లో వేసి వేడి చేయాలి . వేడి అయ్యాక ఆ నూనెలో రెడీగా పెట్టుకొన్న ఫిష్ కట్ లెట్ వేసి డీఫ్ ఫ్రై చేసుకోవాలి.  Step 8 అంతే ఫిష్ కట్ లెట్ రెడీ. దీన్ని వేడి వేడి ఆనియన్ సలాడ్ /మింట్ /టామరిండ్ చట్నీతో సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add