badusha By , 2018-04-11 badusha Here is the process for badusha making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 30min Ingredients: మైదా-ఒక కప్పు,నెయ్యి-రెండు టీస్పూన్లు,బేకింగ్ సోడా-చిటికెడు,పెరుగు/యోగర్ట్-అర కప్పు,పంచదార- ఒక కప్పు,నీళ్ళు-ఒక కప్పు,ఏలకుల పొడి-చిటికెడు,నూనె-వేయించడానికి, Instructions: Step 1 ఒక బౌల్ తీసుకుని దానిలో పెరుగు/యోగర్ట్,నెయ్యి, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి ఒక వెడల్పాటి గిన్నెలో మైదా వేసి దానిలో మెల్లిగా పెరుగు వేస్తూ చపాతీ పిండిలా కలపాలి.  Step 2 ఈ కలిపిన పిండిని పది నిమిషాలు నాననివ్వాలి గిన్నెలో నీళ్ళు తీసుకుని దానిలో పంచదార వేసి పంచదార పాకం వచ్చేంతవరకూ మరిగించాలి. Step 3 పాకం తయారీలో స్టౌ మంట సన్నగా ఉండాలి.పల్చటి సిరప్ లా అయ్యేవరకూ నీళ్ళూ పంచదార మీశ్రమాన్ని స్టౌ మీద ఉంచాలి. Step 4 పాకం వచ్చాకా స్టౌ కట్టేసి ఏలకుల పొడి కలపాలి కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ప్యాటీస్ లాగ చెయ్యాలి.కావాలనుకుంటే ప్యాటీల చివర్లు లోపలకి మడిచి అందంగా కూడా తయారుచేసుకోవచ్చు. Step 5 మూకుడులో నూనె వేడి చేసి,ఈ ప్యాటీలని మెల్లిగా నూనెలో వెయ్యాలి సన్నని సెగ మీద బాదూషా పూర్తిగా వేగేవరకూ వేయించుకోవాలి.  Step 6 బ్రౌన్ కలర్ వచ్చాకా బాదూషా ని నూనెలో నుండి తీసి 2-3 నిమిషాలు పక్కన ఉంచాలి.  Step 7 పక్కన పెట్టుకున్న బాదుషాలని పంచదార పాకంలో వేసి రాత్రంతా నాననివ్వాలి. 12.మరునాడు డ్రై ఫ్రూట్స్ తో అలకరించుకుని ఈ నవరాత్రుల్లో నోరూరించే బాదుషాని ఆస్వాదించండి.  
Yummy Food Recipes
Add