tamoto rasam By , 2018-03-30 tamoto rasam Here is the process for tamoto rasam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: టమోటాలు - 3,నీరు - 3 కప్పులు,వెల్లుల్లి (తొక్క తీయకుండా) - 4 రేకలు,లవంగాలు - 1 స్పూన్,జీలకర్ర - 2 స్పూన్స్,ఉప్పు - రుచికి సరిపడా,చింతపండు - అర నిమ్మకాయ,పరిమాణం రసం పొడి - 2 టేబుల్ స్పూన్లు,నూనె - 2 టేబుల్ స్పూన్లు,ఆవాలు - 1 స్పూన్,కరివేపాకు - 8-10,ఇంగువ - చిటికెడు,కొత్తిమీర ఆకులు (సన్నగా తరిగిన) - ½ కప్పు,నెయ్యి - 2 స్పూన్స్, Instructions: Step 1 టమోటాలు తీసుకోని టమోటా పై భాగంలో కట్ చేయాలి. Step 2 టమోటాకు మూడు నిలువు గాట్లు పెట్టాలి. టమోటాలను హెవీ హీటెడ్ పాన్ లో వేయాలి.  Step 3 దానిలో నీరు పోసి 15 నిమిషాల పాటు మృదువుగా మారే వరకు ఉడికించాలి. టమోటాలను బౌల్ లోకి తీసుకోవాలి. పాన్ లో నీటిని తరవాత ఉపయోగించాలి.  Step 4 టమోటాలను 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి టమోటాల తొక్క తీసేసి కొంచెం మాష్ చేసి పక్కన పెట్టాలి.    Step 5 సనికిలిలో వెల్లుల్లి వేయాలి దానిలో ఒక స్పూన్ మిరియాలు మరియు ఒక స్పూన్ జీలకర్ర వేయాలి. రోకలితో కచ్చా పచ్ఛాగా నూరాలి.   Step 6 పాన్ లో నీటిని రెండు నిమిషాల పాటు వేడి చేయాలి. దానిలో టమోటా గుజ్జు మరియు నూరిన వెల్లుల్లి పేస్ట్ వేయాలి.    Step 7 ఉప్పు మరియు చింతపండు వేసి 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించాలి.  రసం పొడి కలపాలి.    Step 8 రసంను బౌల్ లోకి తీసుకోవాలి. తాలింపు పాన్ పొయ్యి మీద పెట్టి ఒక స్పూన్ నూనె వేయాలి.    Step 9 దానిలో ఆవాలు మరియు ఒక స్పూన్ జీలకర్ర వేయాలి.  ఆ తర్వాత ఇంగువ,కరివేపాకు వేయాలి.    Step 10 బాగా వేగనివ్వాలి వేగిన తాలింపును రసంలో పోయాలి తరిగిన కొత్తిమీర కలపాలి నెయ్యి కలపాలి ఒక బౌల్ లోకి రసంను తీసుకోని అన్నంలోకి సర్వ్ చేయాలి.              
Yummy Food Recipes
Add