makhana kheer recipe making special events healthy food By , 2014-12-09 makhana kheer recipe making special events healthy food makhana kheer recipe : This is a special food for those who is in fasting. Prep Time: 20min Cook time: 15min Ingredients: 3 కప్పులు లోఫ్యాట్ మిల్క్, 1 లేదా 2 కప్పులు మఖాన, 1 1/2 పంచదార, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 5 - 6 బాదాం, 5-7 జీడిపప్పు (మధ్యలోకి కట్ చేసుకోవాలి), చిటికెడు నట్’మగ్ పౌడర్, కొద్దిగా కుంకుమపువ్వు, Instructions: Step 1 ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి బాగా వేగించాలి. అలా వేగుతుండగానే అందులో మఖాన వేసి 5 నిముషాలవరకు మీడియం వంటమీద వేడి చేయాలి. అనంతరం వాటిని ఒక ప్లేట్ లోనికి తీసుకుని పెట్టుకోవాలి. Step 2 మరోవైపు పాలలో కొద్దిగా కుంకుమపువ్వు వేసి నానబెట్టుకోవాలి. Step 3 మరొక పాన్ తీసుకుని అందులో డీప్ బాటమ్’లో కొద్దిగా పాలు పోసి.. చిక్కబడే వరకూ మరిగించాలి. మరిగిన అనంతరం అందులో ఇదివరకే వేయించుకున్న మఖానాను వేసి.. మరో ఐదు నిముషాల వరకు మీడియం మంటమీద ఉడికించాలి. ఉడుకుతుండగా.. అందులో పంచదార వేసి.. బాగా కరిగేవరకు వేగించాలి. Step 4 తర్వాత అందులో ముందుగా కుంకుమపువ్వు నానబెట్టుకున్న పాలను పోసి బాగా మిక్స్ చేస్తూ ఉడికించాలి. బాగా ఉడికిన అనంతరం స్టౌవ్ ఆఫ్ చేసేయాలి. Step 5 అలా ఆఫ్ చేసిన అనంతరం అందులో బాదం, జీడిపప్పు, నట్’మగ్ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే.. ఈ విధంగా మఖాన్ ఖీర్’ను తయారుచేసుకుని, సర్వ్ చేసుకోవచ్చు.
Yummy Food Recipes
Add