carrot sweet corn omelete By , 2018-03-19 carrot sweet corn omelete Here is the process for carrot sweet corn omelet e making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: కేరట్ - 2,స్వీట్ కార్న్ - 50 గ్రా,గుడ్లు - 2,ఉల్లిపాయ - 1,పచ్చిమిర్చి - 5,కొత్తిమీర - కొద్దిగా,ఉప్పు, నూనే - తగినంత, Instructions: Step 1 ఈ ఆమ్లెట్ తయారి కోసం ముందుగా స్వీట్ కార్న్ ని ఉడికించి ఉంచుకోవాలి. కేరట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఈ మూడింటిని సన్నగా తరుగుకుని ఉంచుకోవాలి.  Step 2 ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనే వేసి కాగాకా ఉల్లిమిక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు వేగనివ్వాలి. Step 3 అందులో కేరట్ తురుము కూడా కలిపి 2 నిమిషాల తరువాత ఉప్పు కొత్తిమీర తరుగు వేసి ఆఖరుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ ని వేసి అంతా బాగా కలిపి దించెయ్యాలి. Step 4 ఇప్పుడొక గిన్నెలో గుడ్లు పగలకొట్టి స్పూన్ తో బాగా గిలకొట్టాలి.    Step 5 స్టవ్ మీద పెనం పెట్టి ఆమ్లెట్ వేసి కాస్త కాలాకా దాని మీద మనం ముందుగా సిద్దం చేసుకున్నకేరట్ , స్వీట్ కార్న్ మిశ్రమాన్ని వేసి పూర్తిగా కాలాకా రెండో వైపు తిప్పకుండా తీసెయ్యాలి. ఇలాంటి ఆమ్లెట్ వద్దనే పిల్లలు కూడా ఉండరు. మీరే  ట్రై  చేసి చూడండి.              
Yummy Food Recipes
Add