kashmiri kheema By , 2018-03-19 kashmiri kheema Here is the process for kashmiri kheema making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మటన్ ఖీమా - 1 కిలో,ఆవాల నూనె - 100 గ్రాములు,ఉప్పు - తగినంత,కారం - రెండు స్పూన్లు,సోంపు పౌడర్ - రెండు స్పూన్లు,సొంఠి పొడి - అర స్పూను,గరం మసాలా - స్పూను,యాలకుల గింజలు - స్పూను,జీలకర్ర - స్పూను,ఇంగువ - అర స్పూను,బిర్యానీ ఆకు - రెండు,నెయ్యి - స్పూను,కొత్తిమీర - ఒక కట్ట, Instructions: Step 1 మటన్ ఖీమాను ఒక పెద్ద బౌల్‌లోకి తీసుకోవాలి. దాంట్లో ఉప్పు, కారం, సోంపు పొడి, సొంఠి పొడి, ఒక స్పూను ఆవాల నూనె, యాలకుల గింజలు వేసి బాగా కలపాలి.  Step 2 ఇప్పుడు తయారైన ఈ పదార్ధంతో ఖీమా బాల్స్ తయారు చేసుకోవాలి. ఈ బాల్స్ గుండ్రంగా ఉండొచ్చు లేదా ఓవెల్ షేప్‌లో అయినా వుండొచ్చు.  Step 3 కిలో ఖీమాని 35 నుంచి 40 బాల్స్ చేసుకోవచ్చు.  ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకుని, అందులో మిగిలిన ఆవాల నూనె పోయాలి.  Step 4 సన్నటి మంట మీద నూనెను కాచి, దాంట్లో జీలకర్ర, ఇంగువ వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 50 మిల్లీ లీటర్ల నీటిని పోయాలి.    Step 5 ఇప్పుడు అందులో ఉప్పు, కారం వేయాలి. ఈ పదార్ధం బాగా చిక్కబడేవరకూ ఉంచిన తర్వాత అందులో సిద్ధంగా వుంచుకున్న మటన్ ఖీమా బాల్స్ వేయాలి.    Step 6 ఖీమా బాల్స్ సగమైనా మునగాలి. అలా కాకుండా చిక్కగా వుంటే, ఒక సగం గ్లాసు నీళ్ళు పోసుకోవచ్చు.    Step 7 ఇప్పుడు పది నిమిషాలపాటు మూత పెట్టి మీడియం మంట మీద ఖీమాబాల్స్ బాగా ఉడకనివ్వాలి.    Step 8 ఇప్పుడు గరమ్ మసాలా వేసి బాగా కలపాలి. మరో రెండు నిమిషాలు పాన్ మీద మూత పెట్టి వుంచి కిందకి దించేయాలి. ఇప్పుడు తరిగి వుంచుకున్న కొత్తిమీరని పైన చల్లుకోవాలి.          
Yummy Food Recipes
Add