mutton keema pizza By , 2018-03-19 mutton keema pizza Here is the process for mutton keema pizza making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: కీమా - ఒక కప్పు,పిజ్జా బేస్ - రెండు,ఛీజ్ - 100 grms,నూనె - 1 టేబుల్ స్పూన్,షాజీరా - ½ టీ స్పూన్,ఉప్పు - ½ టేబుల్ స్పూన్,కారం - ½ టేబుల్ స్పూన్,ధనియాలపొడి - ½ టేబుల్ స్పూన్,అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టేబుల్ స్పూన్,టమాటో కెచప్ - 2 టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 ముందుగా కీమాలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం అల్లం వెల్లులి ముద్ద వేసి, నీళ్ళు పోయకుండా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. Step 2 తరువాత ఒక బాణలిలో నూనె వేసి, షాజీర, అల్లం వెల్లులి ముద్ద వేసి వేపాలి.అల్లం వెల్లులి ముద్ద కొద్దిగా వేగిన తరువాత ముందుగా ఉడకబెట్టిన కీమా వేసి మూత పెట్టి, కీమాలో నీళ్ళు ఇగిరిపోయేదాకా ఉడకపెట్టాలి. Step 3 కీమాలో నీళ్ళు మొత్తం ఇగిరిపోయాక మిగిలిన ఉప్పు, కారం, ధనియాలపొడి వేసి కలపాలి.కీమా బాగా వేగిన తరువాత తీసి పక్కన పెట్టాలి. Step 4 తరువాత పిజ్జా బేస్ తీసుకుని కత్తితో నాలుగు భాగాలుగా గాటు పెట్టుకోవాలి. దానిపైన టమాటో కెచప్ వేసి సమంగా పూయాలి. దీనిపైన కీమా వేసి సమంగా పరవాలి. దానిపైన ఛీజ్ తురుము వేయాలి.   Step 5 ఇలా తయారు చేసిన పిజ్జాని ముందుగా వేడిచేసి పెట్టుకున్న ఓవెన్లో బేక్ చేసుకోవాలి. లేదా ఒక నాన్ స్టిక్ పాన్ లో పిజ్జాని పెట్టి దానిపై మూత పెట్టి స్టవ్ మీద సన్నని సెగతో పాన్ పిజ్జా చేసుకోవచ్చు.   Step 6 ఛీజ్ కరిగి పిజ్జా లేత గోధుమ రంగులోకి వచ్చినప్పుడు బయటకు తీసి, దానిమీద చిల్లి ఫ్లేక్స్ గాని ఒరిగానో గాని చల్లి వేడివేడిగా వడ్డించాలి.          
Yummy Food Recipes
Add