sweet heart jam drops By , 2018-03-18 sweet heart jam drops Here is the process for sweet heart jam drops making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 35min Ingredients: బటర్ - 125 గ్రాములు,పంచదార - అరకప్పు,వెనీలా ఎస్సెన్స్ - అర టీ స్పూన్,కోడిగుడ్డు - ఒకటి,మైదా - కప్పున్నర,జామ్ - ఐదు స్పూన్లు, Instructions: Step 1 సేకరించి ఉంచుకున్న పదార్థాలతో స్వీట్ హార్ట్ జామ్ డ్రాప్స్ తయారు చేయడం ప్రారంభించడానికి ముందుగా ఓవెన్‌ని ఆన్ చేసుకుని పెట్టుకోవాలి. 180 డిగ్రీల ఉష్ణోగ్రత వుండేలా చూసుకోవాలి.  Step 2 మిక్సీలో బటర్, పంచదార, వెనీలా ఎసెన్స్ ఈ మూడూ మిక్సీలో వేసుకుని బాగా కలిసిపోయేలా చేయాలి.  Step 3 ఆ తర్వాత అందులోనే కోడిగుడ్డు, మైదా పిండి వేసి బాగా ముద్దలా అయ్యేలా చేయాలి. మిక్సీలోంచి బయటకి తీసిన తర్వాత కూడా ఆ మిశ్రమాన్ని బేసిన్‌లో వేసుకుని పూరీ పిండిలా కలుపుకోవాలి.  Step 4 తర్వాత ఆ పిండిని చిన్నచిన్న ముద్దలుగా తీసుకుని, అంటే పైన పేర్కొన్న కొలతలకి 10 ముద్దలు అవుతాయి. ఆ ముద్దలకు గుండ్రని షేప్ ఇవ్వాలి. ఆ గుండ్రని షేప్‌కి మధ్యలో హార్ట్ షేప్‌లో గుంట వచ్చేలా చేయాలి.    Step 5 ఆ తర్వాత వీటిని ఓవెన్‌లో ఉంచి వాటికి బంగారు రంగు వచ్చే వరకూ 20 నిమిషాలపాటు బేక్ చేయాలి.    Step 6 ఇప్పుడు బంగారు రంగులో కరకరలాడే హార్ట్స్ తయారవుతాయి. వాటిని బయటకి తీసి చల్లార్చిన తర్వాత ఆ హార్ట్స్‌లో మధ్యలో వున్న ఖాళీలో మీకు నచ్చే తరహా జామ్‌ నింపుకోవాలి.    Step 7 ఇప్పుడు సిద్ధమైన స్వీట్ హార్ట్ జామ్ డ్రాప్స్‌ని ఇష్టమైన వాళ్ళతో కలసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కొద్దికొద్దిగా కొరుక్కుని తింటూ వుంటే... అబ్బ... ఎంత బాగుంటాయో...!          
Yummy Food Recipes
Add
Recipe of the Day