chicken noodles recipes By , 2014-12-08 chicken noodles recipes chicken noodles recipes : The Making Of Chicken Noodles Recipes which only served in restaurants. Here are some tips to make in home.. Prep Time: 20min Cook time: 20min Ingredients: 1 కప్ ఎముకలు లేని చికెన్ (మీడియం సైజ్’లో కట్ చేసుకోవాలి), 2 కప్స్ చికెన్ హక్కా నూడిల్స్, 1 కప్ క్యారెట్లు (సన్నగా తరిగి పెట్టుకోవాలి), 1 కప్ బెల్ పెప్పర్ (క్యాప్సికమ్) (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి), 1 కప్ వైట్ స్ర్పింగ్ ఆనియన్ (ఉల్లిపాయలు) (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి), 1 కప్ గ్రీన్ స్ర్పింగ్ ఆనియన్ (ఉల్లిపాయలు) (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి), 4 లవంగాలు, 2 లేదా 3 పచ్చిమిర్చి (మధ్యలోకి కట్ చేసుకోవాలి), 1/2 టేబుల్ స్పూన్ సోయ్ సాస్, 1/4 టేబుల్ స్పూన్ కారం సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, 1 టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరిపడా ఉప్పు, తగిన పరిమాణంలో తెలుపు మిరియాల పొడి, Instructions: Step 1 ముందుగా చికెన్ ముక్కలను నీటిలో వేసి బాగా శుభ్రం చేసుకోవాలి. Step 2 ఒక గిన్నెలో కాస్త నీళ్లు తీసుకుని కడిగిన చికెన్’ను అందులో వేయాలి. దీనిని 10 నిముషాల వరకు స్టౌవ్ మీద ఉడికించి పెట్టుకోవాలి. Step 3 ఉడికిన తర్వాత నీటిని పడేసి.. చికెన్ ముక్కలను పక్కన పెట్టుకోవాలి. Step 4 మరొక గిన్నెలో నూడిల్స్ తీసుకుని, అందులో సరిపడా నీటిని పోసి ఉడికించుకోవాలి. Step 5 ఉడికిన అనంతరం నీటిని పడేసి, ఆ వేడి నూడిల్స్’లో కాస్త చల్లనీళ్లు పోసి, కడిగి పక్కన పెట్టుకోవాలి. Step 6 ఒక పెద్ద నాన్’స్టిక్ తవా తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి. Step 7 నూనె వేడయిన అనంతరం అందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి 5నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి. Step 8 అలా కొద్దిసేపు వేడి చేసుకున్న తర్వాత అందులో తెల్లఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సిమ్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి. మీడియం మంటమీద మొత్తం మిశ్రమాన్ని వేగించుకోవాలి. Step 9 అలా వేగుతున్నప్పుడే అందులో ఉప్పు, వైట్ పెప్పర్ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. Step 10 బాగా వేడెక్కిన అనంతరం అందులో ముందుగా ఉడికించుకొన్న చికెన్ ముక్కలు, సోయా సాస్, చిల్లీ సాస్, టమోటో సాస్ వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి. Step 11 చికెన్ వెజిటేబుల్స్ తో బాగా కలగలిపి మరికొన్ని నిముషాలు ఉడికించుకోవాలి. Step 12 చికెన్ ఉడికిన తర్వాత చివరగా గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మిక్స్ చేయాలి. Step 13 తర్వాత ఉడికించిన నూడిల్స్ కూడా మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి. Step 14 అంతే.. ఈ విధంగా రెస్టారెంట్ స్టైల్ చికెన్ నూడిల్స్’ను ఎంతో సులభంగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.
Yummy Food Recipes
Add
Recipe of the Day