oats upma By , 2018-03-13 oats upma Here is the process for oats upma making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: ఓట్స్ - 2 కప్పులు,,నూనె - 3 టీస్పూన్లు,,పసుపు - 1 టీస్పూన్,,మినప్పప్పు - 1 టీస్పూను,,ఆవాలు - 1 టీస్పూను,,కరివేపాకు - 2 రెమ్మలు,,ఎండుమిర్చి - 2,,పచ్చిమిర్చి - 2,,ఉల్లి ముక్కలు - అర కప్పు,,క్యారెట్ ముక్కలు - అర కప్పు,,బఠాణీ - పావు కప్పు,,చక్కెర - 1 టీస్పూను,,ఉప్పు - తగినంత,,కొత్తిమీర - కట్ట., Instructions: Step 1 మొదట స్టౌ మీద పాన్‌ పెట్టి, అది వేడయ్యాక అందులో ఒక టీస్పూన్ నూనె వేసి కాగాక ఓట్స్, పసుపు వేసి, మీడియం ప్లేమ్ మీద 4 నిమిషాలపాటు వేయించాలి. Step 2 వేగిన ఓట్స్‌ను గిన్నెలోకి తీసి అదే పాన్‌లో మరో రెండు టీస్పూన్ల నూనె వేసి ఆవాలు, ఉల్లి ముక్కలు వేసి వేయించాలి. Step 3 తర్వాత మినప్పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.  Step 4 ఉల్లి ముక్కలు వేగాక క్యారెట్ ముక్కలు, పచ్చి బఠాణీలు వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి.   Step 5 ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న ఓట్స్‌ను వేసి, అందులో చక్కెర, ఉప్పు వేసి, బాగా కలిపి 2 నిమిషాలు వేయించాలి.   Step 6 ఇప్పుడు ఆ మిశ్రమంలో ఒకటిన్నర కప్పుల వేడి నీళ్లు పోసి మూత మూత పెట్టేయాలి.    Step 7 తర్వాత మరో ఏడు నిమిషాల ఉడికించాలి.   Step 8 ఓట్స్ మెత్తగా ఉడికాక కొత్తిమీర తరుగుతో అలంకరించి సర్వ్ చేయాలి. ఓట్స్ మెత్తగా ఉడికాక కొత్తిమీర తరుగుతో అలంకరించి సర్వ్ చేయాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day