- Step 1
ఓవెన్‌ని ముందుగా 350 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడిచేసి పెట్టుకోవాలి. అలాగే కేక్ టిన్నులో కొద్దిగా మైదా చల్లి (లేదా) నెయ్యి పెట్టుకోవచ్చు.
- Step 2
వెడల్పాటి గిన్నెలో క్రీం, వెన్నా, చక్కెరా, నూనె, జిలాటిన్ తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి.
- Step 3
ఇందులోనే మూడు గుడ్డు సొనా వేసుకుంటూ కలుపుకోవాలి.
- Step 4
తరవాత మైదా, బేకింగ్‌పౌడర్ కూడా వేసి పిండిలా కలిపి అందులో స్ట్రాబెర్రీ ఎసెన్స్, స్ట్రాబెర్రీ గుజ్జు కూడా కలిపి కేక్ టిన్నులోకి తీసుకోవాలి.
- Step 5
దీన్ని ఇరవైఅయిదు నిమిషాల పాటు బేక్‌చేసుకుని తీసుకోవాలి.
- Step 6
బాగా చల్లారాక ఆ టిన్‌ని ప్లేట్ లో తిరగేస్తే సరిపోతుంది. 10 నిముషాల తరవాత ముక్కలు కోసుకోవాలి..