Prawns Biryani By , 2018-02-16 Prawns Biryani Here is the process for Prawns Biryani making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 35min Ingredients: రొయ్యలు : అర కిలో,బాస్మతి బియ్యం : 2 కప్పులు,ఉల్లిపాయ : సన్నగా ముక్కలు చేయాలి,పచ్చి మర్చి : 2 నిలువుగా చీల్చాలి,అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2 టీ స్పూన్లు,టమాటోలు : 2 ముక్కలుగా తరుగుకోవాలి,నిమ్మకాయ : ఒకటి,కొత్తిమీర : గుప్పెడు,పొదినా ఆకులు : గుప్పెడు,కారం : 2 స్పూన్లు,ధనియాల పౌడర్ : 1 స్పూను,పసుపు : పావు స్పూను,ఉప్పు : తగినంత,లవంగాలు : 4,పెరుగు : అరకప్పు,దాల్చిన చెక్క : 1 ముక్క,ఏలకులు : రెండు,బిర్యాని ఆకు : 1,జాపత్రి : 1,నెయ్యి : 2 స్పూన్లు,నూనె : 2 స్పూన్లు, Instructions: Step 1 రొయ్యలు ఒలిచి శుభ్రం చేసుకోవాలి. బాగా కడిగి ఒక స్పూను కారం, అర స్పూను ధనియాల పౌడర్, ఒక స్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉప్పు అన్నింటినీ రొయ్యలకు బాగా పట్టించి పక్కన ఉంచుకోవాలి.  Step 2 పాన్లో నూనె, నెయ్యు వేసి కాగాక దాల్చిన చెక్క, ఏలకులు, బిర్యానీ ఆకు, జాపత్రి, లవంగాలు వేయాలి. తరువాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి. Step 3 తరువాత మిగిలిన అల్లం, వెల్లుల్లి పేస్ట్,పచ్చి మిర్చి వేసి పచ్చివాసన పోయే దాకా రెండు మూడు నిమిషాల పాటు వేయించాలి. తరువాత టమాటోలు, మిగిలిన కారం, ధనియాల పౌడర్, పసుపు వేసి మంచి మషాలా వాసన వచ్చేదాకా వేయించాలి.  Step 4 తరువాత తరిగిన కొతిమీర కొద్దిగా, తరిగిన పొదీనా ఆకులు వేసి 2 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత మషాలా పట్టించిన రొయ్యలను కలపి రెండు నిమిషాలపాటు ఉంచాలి.    Step 5 తరువాత బియ్యం, నిమ్మరసం, మూడు కప్పుల నీళ్ళు కలిపి బాగా కలిపి మొత్తం ఉడికే దాకా ఉంచి దించుకోవాలి. రుచి కోసం కొత్తీమీర చల్లుకోవచ్చు.              
Yummy Food Recipes
Add