Methi Palav By , 2018-02-16 Methi Palav Here is the process for Methi Palav making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 30min Ingredients: బియ్యం – 2 కప్పులు,నెయ్యి - రెండు టేబుల్స్పూన్లు,జీలకర్ర – చెంచా,బిర్యానీ ఆకులు – మూడు,దాల్చిన చెక్క -నాలుగు ముక్కలు చిన్నవి,యాలకులు – రెండు,లవంగాలు – నాలుగు,పచ్చిమిర్చి – నాలుగు,ఉల్లిపాయలు – రెండు,మెంతికూర – కట్ట,మిరియాలపొడి – అరచెంచా,గరంమసాలా – చెంచా,ఉడికించిన బంగాళాదుంప ముక్కలు – అరకప్పు,ఉప్పు - తగినంత, Instructions: Step 1 వెడల్పాటి పాన్ లో నెయ్యి వేసి వేడెక్కిన తరువాత జీలకర్ర, బిర్యానీఆకులు, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేయించాలి.  Step 2 రెండు నిమిషాలయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. అవి కూడా వేగాక ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, మెంతి ఆకులు వేయాలి. మంట తగ్గించి వేయిస్తే పచ్చివాసన పోయి మెంతికూర వేగుతుంది.  Step 3 ఆ తరవాత కడిగిన బియ్యం కూడా వేసి వేయించాలి. రెండు నిమిషాలయ్యాక తగినంత ఉప్పు, గరంమసాలా, మిరియాలపొడి వేసి నాలుగు కప్పుల నీళ్లు పోయాలి.  Step 4 మూత పెట్టి మంట తగ్గించి ఉంచేయాలి. అన్నం ఉడికాక దింపేస్తే సరిపోతుంది. వేడివేడి మేథీపలావ్ చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికీ మంచిది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day