Prawns Fry By , 2018-02-15 Prawns Fry Here is the process for Prawns Fry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: రొయ్యలు - పావుకేజీ,నూనె- మూడు చెంచాలు,దాల్చినచెక్క - చిన్నముక్క,జీలకర్ర - చెంచా,యాలకులు - రెండు,ఉల్లిపాయ - ఒకటి పెద్దది,పచ్చిమిర్చి - ఒకటి,కరివేపాకు - రెండు రెబ్బలు,అల్లం, వెల్లుల్లి పేస్టు - చెంచా,కారం - చెంచా,ధనియాల పొడి - చెంచా,పసుపు - పావు చెంచా,గరంమసాలా - అర చెంచా,మిరియాల పొడి - అర చెంచా,టొమాటోలు - రెండు,ఉప్పు - తగినంత,నీళ్లు - అర కప్పు,,మసాలా కోసం: ,అల్లం వెల్లులి ముద్ద - చెంచా,,కారం - చెంచా,,ధనియాల పొడి - రెండు చెంచాలు,,పసుపు - అరచెంచా,,గరం మసాలా - అర చెంచా,,మిరియాల పొడి - చెంచా,,ఉప్పు - తగినంత., Instructions: Step 1 ఒక గిన్నెలో శుభ్రం చేసిన రొయ్యలపై మసాలాకోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ వేసి బాగా కలపాలి. పది నిమిషాలయ్యాక పొయ్యిమీద గిన్నెపెట్టి నూనె పోయాలి.  Step 2 అందులో రొయ్యలు వేసి వేయించి తీసుకోవాలి. అదే నూనెలో దాల్చినచెక్కా, యాలకులూ, జీలకర్ర వేయించి ఉల్లిపాయముక్కలూ, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. Step 3 తరువాత అల్లం,వెల్లులి ముద్దా, తగినంత ఉప్పూ, కారం, ధనియాలపొడీ, పసుపూ, గరం మసాలా, మిరియాల పొడి వేసి బాగా కలపాలి.  Step 4 ఇందులో టొమాటో ముక్కలు వేసి కాసిని నీళ్లు పోయాలి. టొమాటో ముక్కలు ఉడికాక ముందుగా వేయించిపెట్టుకున్న రొయ్యలు వేసి మంట తగ్గించాలి. అవి ఉడికాక దింపేస్తే చాలు.          
Yummy Food Recipes
Add
Recipe of the Day