pachi royyalu gudlu curry By , 2018-02-09 pachi royyalu gudlu curry Here is the process for making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: గుడ్లు : ఆరు,పచ్చిరొయ్యలు : పావుకేజీ,ఉల్లిపాయలు : మూడు,పచ్చిమిర్చి : మూడు,కారం : టీ స్పూన్,ఉప్పు : తగినంత,అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్,గరం మసాలా : అర టీ స్పూన్,చింతపండు : నిమ్మకాయంత,కరివేపాకు : రెండు రెమ్మలు,పసుపు : పావు టీ స్పూన్,నూనె : మూడు టేబుల్ స్పూన్లు,కొత్తిమీర : కొద్దిగా,టమాటాలు : రెండు, Instructions: Step 1 గుడ్లు ఉడికించి వలిచి పక్కన పెట్టాలి. పచ్చిరొయ్యలు లో ఉప్పు, పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు ముక్కలుగా కట్ చెయ్యాలి. Step 2 స్టవ్ వెలిగించి కళాయిపెట్టి నూనె వేడిచెయ్యాలి. నూనె కాగాక గుడ్లుకి అక్కడక్కడ గాట్లుపెట్టి వేయించి తియ్యాలి. Step 3 అదే నూనెలో ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయించాలి. తరువాత అల్లంవేల్లుల్లి పేస్టు వేసి వేగిన తరువాత టమాట ముక్కలు వేసి మగ్గిన తరువాత పచ్చిరొయ్యలు వేసి కలిపి ఒకనిముషం మూతపెట్టాలి. Step 4 ఇప్పుడు మూతతీసి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి మూతపెట్టి ఐదునిముషాలు ఉడకనివ్వాలి. తరువాత చింతపండురసం, గుడ్లు వేసి మరో ఐదునిముషాలు ఉడకనివ్వాలి.ఇప్పుడు మసాలా, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆపాలి.                  
Yummy Food Recipes
Add