bhindi gravy masala By , 2018-01-30 bhindi gravy masala Here is the process for bhindi gravy masala making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బెండకాయలు: అరకిలో,,ఉల్లిపాయ: ఒకటి,,టొమాటోలు: రెండు,,అల్లంవెల్లుల్లి: టీస్పూను,,పెరుగు: కప్పు,,కొబ్బరి తురుము: టేబుల్‌స్పూను,,జీడిపప్పు: 8,,గరంమసాలా: టీస్పూను,,కారం: టీస్పూను,,పసుపు: అరటీస్పూను,,ఆమ్‌చూర్‌: టీస్పూను,,నూనె: 2 టేబుల్‌స్పూన్లు,,ఉప్పు: రుచికి సరిపడా,,మంచినీళ్లు: కప్పు,,తాలింపుకోసం: ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు,,నూనె: 2 టేబుల్‌స్పూన్లు, Instructions: Step 1 బెండకాయల్ని కడిగి కాస్త పెద్ద సైజు ముక్కలుగా కోసి ఆరనివ్వాలి. Step 2 గోరువెచ్చని నీటిలో జీడిపప్పు పది నిమిషాలు నాననివ్వాలి. తరవాత వీటికి కొబ్బరి కూడా చేర్చి మెత్తగా రుబ్బాలి. Step 3 బాణలిలో నూనె వేసి బెండకాయ ముక్కల్ని మీడియం మంటమీద ఐదు నిమిషాలు వేయించాలి. వేగాక వాటిని తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు బాణలిలో మరో టీస్పూను నూనె వేసి తాలింపు చేయాలి. తరవాత ఉల్లిముక్కలు వేసి వేగాక అల్లంవెల్లుల్లి, ఆమ్‌చూర్‌, కారం, పసుపు వేసి రెండు నిమిషాలు వేయించాలి. టొమాటో ముక్కలు వేసి నాలుగు నిమిషాలు వేయించాలి. Step 4 జీడిపప్పు-కొబ్బరి ముద్ద వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. పెరుగు, ఉప్పు వేసి కలపాలి. ఓ నిమిషం తరవాత నీళ్లు పోసి బాగా కలిపి మరిగించాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా వేసి సిమ్‌లో ఉడికించి దించితే దహీ భీండీ మసాలా రెడీ.          
Yummy Food Recipes
Add
Recipe of the Day