mutton pepper fry By , 2018-01-24 mutton pepper fry Here is the process for mutton pepper fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 35min Ingredients: మటన్ - అరకిలో, ,ఉల్లిపాయలు - కప్పు (సన్నగా తరిగినవి), ,అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూనులు, ,పసుపు - అర టీస్పూను, ,టమోటో - అరకప్పు (చిన్నముక్కలుగా తరిగినవి), ,కారం - ఒక టీస్పూను, ,మిరియాల పొడి - రెండు టీ స్పూనులు, ,కొత్తిమీర - పావు కప్పు (సన్నగా తరిగినవి) ,కరివేపాకు - రెండు రెమ్మలు, ,సోంపు - అర టీస్పూను, ,మిరియాలు - ఒక టీస్పూను, ,గసగసాలు - అర టీస్పూను, ,ధనియాల పొడి - అర టీస్పూను, ,జీలకర్ర - ఒక టీస్పూను, ,దాల్చిన చెక్క - 1, ,లవంగాలు - 3, ,యాలకులు - 2, ,ఉప్పు - సరిపడినంత, ,నూనె - తగినంత, Instructions: Step 1 మటన్‌ను బాగా కడిగి ప్రెషర్ కుక్కర్‌లో వేసి, మూడు కప్పుల నీళ్లు, కాస్త పసుపు వేసి పావుగంట సేపు ఉడికించుకోవాలి.  Step 2 ఉడికిన మటన్ తీసి పక్కన పెట్టుకోవాలి. కళాయిలో సోంపు, జీలకర్ర, గసగసాలు, మిరియాలు, లవంగాలు, యాలకులు వేయించాలి. Step 3 వాటిని చల్లార్చి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడెక్కాక కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. Step 4 అందులో అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేసి మూడు నిమిషాల పాటూ వేయించాలి.    Step 5 అనంతరం పక్కన పెట్టుకున్న మటన్ ముక్కల్ని అందులో వేసి బాగా వేయించాలి.   Step 6 బాగా వేయిస్తే నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు టమోటో ముక్కలు, కారం, ముందుగా పొడి చేసిన మసాలా, ఉప్పు వేసి కలపాలి. పది నిమిషాలు మీడియం మంట మీద వేగనివ్వాలి.    Step 7 అనంతరం పెప్పర్ పౌడర్ మటన్న ముక్కలపై చల్లి బాగా కలిపి... మూడు నిమిషాల పాటూ వేగనివ్వాలి. అంతే మటన్ పెప్పర్ ఫ్రై సిద్ధమైనట్టే. దీనిపై కొత్తిమీర గార్నిష్ చేస్తే బాగుంటుంది.          
Yummy Food Recipes
Add