Boondi Laddu By , 2018-01-22 Boondi Laddu Here is the process for Boondi Laddu making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 25min Ingredients: శనగపిండి: ఒక కప్పు,చక్కెర: ముప్పావుకప్పు,యాలకుల పొడి: రెండు లేక మూడిటిది,జీడిపప్పులు,,యాలకులు: కొన్ని,నూనె: వేయించడానికి సరిపడా,నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు., Instructions: Step 1 అడుగు మందం ఉన్న పాత్రను తీసుకొని అందులో చక్కెరను వేసి పావుకప్పు నీళ్ళను పోసి తీగ పాకం వచ్చేవరకు వేడి చేయాలి. దానికి యాలకులపొడి కలిపి పక్కన పెట్టాలి. Step 2 శనగపిండిని జల్లించి ఒక పాత్రలో వేసి నీళ్ళు కలుపుతూ దోశపిండిలా కలుపుకోవాలి. Step 3 లోతు ఎక్కువగా ఉన్న మూకుడులో నూనె పోసి బాగా వేడిచేసి పెద్ద జల్లిగరిటెను దానిమీద ఉంచాలి. ఆ పిండిని జల్లిగరిటెలో పోయాలి. అప్పుడు బూందీ చుక్కల్లాగా నూనెలోకి జారుతుంది. ఆ బూందీని కొన్ని సెకెన్లపాటు వేగనిచ్చి, అది కరకరలాడేలా కాకముందే (అంటే మెత్తగా వుండగానే) మూకుడులోంచి తీసేయాలి. బూందీ పచ్చివాసన రాకుండా చూసుకోవాలి. Step 4 ఆ బూందీని వెంటనే ముందే తయారుచేసి ఉంచుకొన్న చక్కెర పానకంలో వేసి బాగా కలపాలి. అలా మొత్తం బూందీ అయిపోయే వరకు చేయాలి.   Step 5 ఒక మూకుడులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి, జీడిపప్పు, కిస్ మిస్ లను బంగారు వర్ణం వచ్చేవరకు వేయించి ఆ లడ్డు మిశ్రమంలో కలపాలి. ఆ మిశ్రమం కొద్దిగా చల్లారాక పెద్ద నిమ్మకాయ సైజులో లడ్డూలను కట్టుకోవాలి.   Step 6 లడ్డూలు పూర్తిగా చల్లారగానే గాలి చొరని పాత్రలో నిల్వ చేసుకోవాలి. ఆ పాత్రను ఫ్రిజ్ లో వుంచితే ఇంకా ఎక్కువ కాలం నిల్వ వుంచుకోవచ్చు.              
Yummy Food Recipes
Add
Recipe of the Day