pudina paratha By , 2018-01-13 pudina paratha Here is the process for pudina paratha making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: గోధుమపిండి - ఒక కప్పు,,మైదా - ఒక కప్పు,,టమాటా - ఒకటి,,పుదీనా - ఒక కట్ట,,కరివేపాకు - నాలుగు రెబ్బలు,,తాళింపు దినుసులు - ఒక చెంచా,,పచ్చిమిర్చి - రెండు,,అల్లం తరుగు - ఒక టీ స్పూను,,ఉప్పు - సరిపడినంత,,నూనె - సరిపడినంత, Instructions: Step 1 గోధుమపిండి, మైదా, నీళ్లు కలిపి చపాతీ పిండి కలిపినట్టు కలపాలి. అందులో ఉప్పు, నూనె కూడా వేసుకోవాలి.  Step 2 పిండి బాగా కలిపాక తడి వస్త్రంలో చుట్టి పక్కన పెట్టేయాలి. ఈలోపు పుదీనాను, టమాటాను సన్నగా తరిగి పెట్టుకోవాలి.  Step 3 ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడెక్కాక తాళింపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు వేసి వేయించాలి.  Step 4 అవి వేగాక సన్నగా తరిగిన టమాటా, పుదీనా వేసి వేయించాలి. బాగా మగ్గాక ఉప్పు చల్లి ఆపేయాలి.    Step 5 దానికి చల్లార్చాక చపాతీ పిండిని ఉండల్లా చుట్టి, వాటి మధ్యలో పుదీనా మిశ్రమాన్ని కూరి మళ్లీ ఉండల్లా చుట్టేయాలి.    Step 6 వాటిని పరోటాలా ఒత్తుకుని పెనం మీద చక్కగా కాల్చుకోవాలి. పుదీనా పరోటాలను ఆలూ కుర్మా, టమాటా చట్నీతో తింటే బాగుంటాయి.          
Yummy Food Recipes
Add