prawns kichidi By , 2018-01-06 prawns kichidi Here is the process for prawns kichidi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: రొయ్యలు - ఒక కప్పు,,బంగాళాదుంప ముక్కలు - అరకప్పు,,టొమాటో - పావుకప్పు,,కొబ్బరి తురుము - రెండు టీస్పూనులు,,బియ్యం - రెండు కప్పులు,,సాంబార్ పొడి - చెంచా,,పచ్చిమిర్చి తరుగు - ఒక టీస్పూను,,అల్లం వెల్లుల్లి పేస్టు - అరచెంచా,,కరివేపాకు రెబ్బలు - రెండు,,ఉల్లిపాయ ముక్కలు - పావుకప్పు,,నానబెట్టిన పెసరపప్పు - ఒక టీస్పూను,,నానబెట్టిన మినప్పప్పు - ఒక టీస్పూను,,నెయ్యి - ఒక టీస్పూను,,ఉప్పు - సరిపడినంత,,కారం - ఒక చెంచా,,పసుపు - చిటికెడు,,నూనె - తగినంత, నీళ్లు - సరిపడినన్ని., Instructions: Step 1 ముందుగా రొయ్యల్ని బాగా కడిగి... కారం, ఉప్పు, పసుపు వేసి అరగంట పాటూ పక్కన పెట్టాలి.  Step 2 తరువాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో కాస్త నెయ్యి వేయాలి.  Step 3 అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, టొమాటో, బంగాళాదుంపముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, కొబ్బరి తురుము వేసి వేయించాలి.  Step 4 అందులోనే మారినేషన్ చేసిన రొయ్యలు కూడా వేయాలి.    Step 5 ఆ మిశ్రమాన్ని బాగా వేగించాలి. రొయ్యలు ఇప్పుడు సగం ఉడికిపోవాలి.    Step 6 తరువాత కడిగిన బియ్యాన్ని వేసి బాగా కలపాలి. అందులోనే నానబెట్టిన పెసరపప్పు, మినప్పప్పు, పసుపు, సాంబార్ పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.    Step 7 ఇప్పుడు రెండు కప్పులు బియ్యానికి నాలుగున్నర కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేయాలి. మూడు విజిల్స్ వచ్చాక దింపేస్తే సరి. రొయ్యల కిచిడీ తినడానికి సిద్దమైనట్టే.          
Yummy Food Recipes
Add
Recipe of the Day