Radish Onion Moong Dal Fry Curry By , 2017-12-27 Radish Onion Moong Dal Fry Curry Here is the process for Radish Onion Moong Dal Fry Curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: ముల్లంగి (మీడియం సైజు) - 2,,పెసరపప్పు - 200 గ్రా.,,ఉల్లిపాయలు - 2,,పచ్చిమిర్చి 3,,వెల్లుల్లి రేకలు - 6,,కరివేపాకు - 4 రెబ్బలు,,పసుపు - పావు టీ స్పూను,,ఉప్పు - రుచికి తగినంత,,శనగపప్పు + మినపప్పు + ఆవాలు + జీలకర్ర = 2 టీ స్పూన్లు,,నూనె - అర టేబుల్‌ స్పూను,,కొత్తిమీర - 1కట్ట., Instructions: Step 1 పెసరపప్పుని దోరగా వేగించి 2 గంటలు నానబెట్టాలి. ముల్లంగిని శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి. కడాయిలో నూనె వేసి మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేగనిచ్చి, తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు, పసుపు కూడా వేసి వేగనివ్వాలి. Step 2 తర్వాత ముల్లంగి తురుము, నానబెట్టి వడకట్టిన పెసరపప్పు వేసి సన్నని మంటపై మగ్గనివ్వాలి. ఈ లోపు వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి గ్రైండ్‌ చేసుకుని ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూరలో వేసి మరికాసేపు మగ్గనిచ్చి దించేముందు కొత్తిమీర జల్లుకోవాలి. వేడి వేడి అన్నంలో ముల్లంగి పెసర కూర ఎంతో రుచిగా ఉంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day