samiya prawn biryani recipe By , 2017-10-05 samiya prawn biryani recipe Here is the process for samiya prawn biryani making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: పచ్చిరొయ్యలు - 250 గ్రా. (ఒలిచినవి),సేమ్యా - 250 గ్రా;,నెయ్యి - 150 గ్రా;,జీడిపప్పు - 100గ్రా,లవంగాలు, ఏలకులు - తగినన్ని;,దాల్చినచెక్క - 5 గ్రా,ఉల్లికాడలు తరుగు - కప్పు;,ఉల్లిపాయలు - 2 (పెద్దవి),పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు;,పెరుగు - కప్పు,నిమ్మరసం - 2 టీ స్పూన్లు,అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు,ఉప్పు, పసుపు, కారం - తగినంత,కొత్తిమీర, పుదీనా - చిన్నకట్ట చొప్పున, Instructions: Step 1 ఒక గిన్నెలో గ్లాసుడు నీరు పోసి మరిగాక అందులో సేమ్యా వేసి ఉడికించి పక్కన ఉంచుకోవాలి.  Step 2 బాణలి స్టౌ మీద ఉంచి అందులో కొద్దిగా నెయ్యి వేసి కాగాక... ఉల్లితరుగు, జీడిపప్పు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.  Step 3 తరవాత అల్లంవెల్లుల్లి పేస్ట్, దాల్చినచెక్క, లవంగాలు, ఏలకులు, ఉల్లికాడలు, పచ్చిమిర్చి తరుగు వరసగా ఒకదాని తరవాత ఒకటి వేసి రెండు నిముషాలు వేయించాలి. Step 4 ఇప్పుడు పచ్చిరొయ్యలు, పెరుగు, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి కలిపి, ఉడుకుతుండగా సేమ్యా వేసి బాగా కలిపి ఒక నిముషం ఉడికిన తరవాత నిమ్మరసం వేసి కలిపి దించేయాలి.   Step 5 కొత్తిమీర, పుదీనా, జీడిపప్పులతో గార్నిష్ చేయాలి.          
Yummy Food Recipes
Add