methi chicken By , 2017-11-23 methi chicken Here is the process for methi chicken making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: చికెన్ - పావుకిలో,మెంతికూర - 10 చిన్నకట్టలు,ఉల్లిపాయలు - 2,లవంగాలు - 4,ధనియాలు - 1 స్పూను,గసగసాలు- 1 స్పూను,దాల్చిన చెక్క - చిన్న ముక్క,పసుపు- చిటికెడు,కారం - 1 స్పూను,ఉప్పు -తగినంత,అల్లం ముక్క - 1,పచ్చిమిర్చి - 2,నూనె - కొంచెం, Instructions: Step 1 చికెన్‌ను చిన్న చిన్న ముక్కలుగా కోసి, కడిగి పక్కన పెట్టుకోవాలి. మెంతికూరల ఆకులు వలిచి వుంచాలి.  Step 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి వుంచాలి.  Step 3 అల్లం వెల్లుల్లి ఒకటిగా, ధనియాలు, గసగసాలు, ఒకటిగా నూరి వుంచాలి. పొయ్యిపై వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి, మాంసం, ఉల్లిపాయముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి, ఉడికించాలి. Step 4 బాగా ఉడికిన తరువాత కాస్త నీళ్లు వుండగానే, మెంతికూర, ధనియాల పేస్ట్ వేసి, సన్నటి సెగన నీరు అయిపోయేంతవరకు ఉడకనివ్వాలి. ఆ తరువాత బాణళిలో కాస్త నూనె వేసి, లవంగాలు, దాల్చిన చెక్క, కాస్త వేగాక, ఉడికిన కూరను వేయాలి. నూనెలో కూర కలిసి, ఎర్రగా వేగాక తీసి వడ్డించాలి.                  
Yummy Food Recipes
Add